YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
- By Gopichand Published Date - 12:16 PM, Wed - 5 June 24

YS Sharmila Wishes: ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Wishes).. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక విషెస్ తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం జోరు చూపింది. కూటమిలో ఉన్న టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఘన విజయం సాధించాయి. ఇక నిన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్న వైసీపీకి కేవలం 11 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే వైఎస్ షర్మిల ఈ కింది విధంగా తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది.
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి.…— YS Sharmila (@realyssharmila) June 5, 2024
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందని రాసుకొచ్చారు.
We’re now on WhatsApp : Click to Join