HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Tweet Goes Viral In Social Media

YS Sharmila: మ‌రోసారి జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన ష‌ర్మిల‌..!

అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం.

  • Author : Gopi Date : 07-11-2024 - 5:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
YS Sharmila

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) మ‌రోసారి సంచ‌లన ట్వీట్ చేశారు. ఈ సారి త‌న ట్వీట్‌లో పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేశారు. సోష‌ల్ మీడియాను కొంద‌రు చెడు చేసే అందుకు ఎక్కువ‌గా ఉపయోగిస్తున్నార‌ని ఆమె మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ష‌ర్మిల త‌న ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. స‌మాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా , రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను.

Also Read: KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా ,…

— YS Sharmila (@realyssharmila) November 7, 2024

అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ .. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం.

అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి పార్టీలు అయినా తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap congress
  • bjp
  • CM Chandrababu
  • Deputy CM Pawan
  • social media
  • tdp
  • tweet
  • ycp
  • ys sharmila
  • YS Sharmila Tweet

Related News

Vijay TVK

TVK విజయ్ ఆసక్తికర ట్వీట్

నటుడు విజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తమిళనాడు ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పాసైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇక ఫెయిలైన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. మంచి జరుగుతుంది, విజయం ఖాయం అంటూ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇది కేవలం విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే కాదని.. ప్రస్తుత తమిళ రాజకీయాలకు లింక్ పెట్టి విజయ్ ట్వీట్ చేశారని

  • Mamata Banerjee declares I am absolutely not backing down

    Bengal Politics: అసలు తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ

  • Ntr Sr

    NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd