YS Sharmila : మకాం మార్చేసిన షర్మిల..జగన్ కు ఇక చుక్కలే
Sharmila : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇక నుండి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయ్యింది
- By Sudheer Published Date - 11:31 AM, Thu - 24 October 24
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila ) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇక నుండి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయ్యింది. ఈరోజు నుంచి ఈ నెల 28 వరకు విజయవాడలో ఆమె ఉండనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గ, మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.
షర్మిల షెడ్యూల్ (YS Sharmila Schedule) చూస్తే..
రేపు 25న అరకు, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల నేతలతో సమావేశం.
అక్టోబర్ 26న కాకినాడ,అమలాపురం,రాజమండ్రి, నరసాపురం జిల్లాల నేతలతో సమావేశం.
అక్టోబర్ 27న ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ,గుంటూరు జిల్లాల నేతలతో సమావేశం.
అక్టోబర్ 28న నంద్యాల , కర్నూలు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశం.
నవంబర్ 6న బాపట్ల, నరసాపురం, అనంతపురం, హిందూపూర్ జిల్లాల నేతల సమీక్ష సమావేశం కానున్నారు.
నవంబర్ 7న కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.
ఇదిలా ఉంటె ప్రస్తుతం వైస్సార్ కుటుంబం(YSR Family )లో ఆస్థి తగాదాలు తారాస్థాయికి చేరాయి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో షేర్ల వివాదం పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ (Jagan) .. షర్మిల పై పిటిషన్ వేయడం రాజకీయాల్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టిస్తుంది. జగన్ షర్మిలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన విషయం రాజకీయాల్లో అనేక చర్చలకు దారితీస్తోంది. షర్మిల – జగన్ లకు సంబంధించిన ఆస్తుల విషయంలో జగన్ కుట్ర చేశాడని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో షర్మిలకు జగన్ రాసిన లేఖలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, జగన్ మీద నిందలు వేస్తుంది. ఈ క్రమంలో టీడీపీ కి కౌంటర్ ఇచ్చింది వైసీపీ. జగన్ గత 10 సంవత్సరాలలో షర్మిలకు రూ. 200 కోట్లను ఇచ్చారని మరియు చెల్లెలిపై ప్రేమ లేకుండా షర్మిలకు ఇంతటి మొత్తాన్ని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. షర్మిలతో కలిసి టీడీపీ రూపొందించిన కుట్రగా, ఈ వ్యవహారాన్ని చరిత్రకు మించి పొడిగిస్తూ ఒక ట్వీట్ చేసింది. మరి ఈరోజు జరగనున్న మీడియా సమావేశంలో షర్మిల ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also : Hyderabad : హైదరాబాద్‌లో మరో సొరంగ మార్గం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్