HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Comments On Relationship With Prabhas

YS Sharmila: ప్రభాస్ తో రిలేషన్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభాస్‌తో సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద జగన్ మరియు ఆదానీ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 22-11-2024 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila Comments
Ys Sharmila Comments

ప్రభాస్‌తో సంబంధం పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో కలిసి ప్రభాస్ తో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన షర్మిల, జగన్ మోహన్ రెడ్డి మరియు ఆదానీ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు:

‘‘నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగినట్లు చెప్పి, జగన్ నాకు ఒక్క ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో చూపించారు. మీకు ఈ విషయం తెలుసుగా, మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు గాడిదలు కాశారా? విచారణ ఎందుకు చేయలేదు? ప్రభాస్ తో నా సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా? మా పిల్లల మీద ఒట్టు వేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఏయ్ ఈ ప్రచారం చేయించారు. నా వీడియో చూపించి ఆయన సానుభూతి పొందాలని అనుకున్నారు. జగన్ తన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు, నాన్న పేరు సీబీఐ చార్జీ షీట్ లో పెడతారు, మల్లి తనపై దుష్ప్రచారం చేయించుకుంటారు’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభాస్ ఎవడో నాకు తెల్వదు.. నేను ప్రభాస్‌ను ఇంతవరకు చూడలేదు.. నా బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్తున్న ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు – వైయస్ షర్మిల #yssharmila #Prabhas #YSRCPSOCIALMEDIA #ysjagan #HashtagU pic.twitter.com/hpENwbM9G2

— Hashtag U (@HashtaguIn) November 22, 2024

జగన్ బాటలో మీరు నడవొద్దు:

‘‘జగన్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవకూడదు. ఇక నుంచి ఏపీ నుండి అదానీకి ప్రాజెక్టులు ఇవ్వొద్దు. మోదీ మరియు అదానీ వేర్వేరు కాదు. మోదీ అదానీకి రక్షణ కల్పిస్తున్నారు. అదానీ మోదీకి డబ్బులు ఇస్తున్నారు. సెబీ చీఫ్ కూడా అదానీ చేతిలో ఉన్నారు. అదానీపై అమెరికాలో కేసు నమోదవడం జరిగింది, కానీ భారతదేశంలో అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని చూసి, మోదీ మరియు అదానీ మధ్య ఉన్న బంధం అర్థం అవుతుంది. పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఇంత డబ్బులు సంపాదించడం ఎలా సాధ్యమో? అదానీ వ్యవహారం మోదీకి మరియు దేశానికి అవమానం.

కాంగ్రెస్ అడిగే ఒక్క ప్రశ్నకి అయినా మోదీ సమాధానం చెప్పాలి. మోదీ అదానీని అమెరికాకు అప్పగిస్తారా? మోదీ అండతోనే దేశంలో ఇంత అవినీతి జరుగుతోంది. జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూఎస్‌ఏ గౌతమ్ అదానీపై అభియోగాలు వేసింది. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చింది. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆగస్టు 2021లో జగన్ కు ముడుపులు అందినట్టు తెలుస్తోంది. పవర్ సప్లైలో అదానీ జగన్ను కలిసినప్పుడు, ‘‘మీకు కావాల్సినది అందిస్తామంటూ’’ ప్రామిస్ చేశారు’’ అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.

మోదికి జగన్ దత్తపుత్రుడు:

‘‘అదానీతో జగన్ కి కొన్ని కీలక విషయాల్లో డిస్కస్ జరిగాయని తెలుస్తోంది. జగన్ మోదీకి దత్త పుత్రుడే. ఆయన మీద విచారణ చేయిస్తారా? అదానీపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కోరుతున్నాను. ఒక సహచరిగా రేవంత్ కు విజ్ఞప్తి చేస్తున్నాను… అదానీతో బిజినెస్ చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డినీ ఎత్తి చూపకపోతే, నా ఆస్తి నాకు ఇస్తానంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్… ఇలాంటివి నేను మాట్లాడకుండా ఉంటే ఎలా?’’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gautam adani
  • narendra modi
  • prabhas
  • ys jagan
  • ys sharmila
  • YS Sharmila About Prabhas

Related News

PM Modi Extends Greetings to CM Vijay

CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రజల కోసం అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయన పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்றுள்ள திரு சி. ஜோசப் விஜய் அவர

  • Vijay is following Jagan once again — Roja

    Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Modi paying respects to a 98-year-old man.

    Narendra Modi: 98 ఏళ్ల వృద్ధుడి పాదాభివందనం చేస్తున్న మోదీ

  • West Bengal BJP CM Suvendu Adhikari

    Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

  • Congress must introspect, says Shashi Tharoor

    Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd