YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్
- By Kode Mohan Sai Published Date - 05:25 PM, Wed - 9 October 24

అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం ద్వారా కార్యకర్తలకు నష్టం జరిగే సమయంలో వారికి భరోసా ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన వెల్లడించారు.
“నేను చేయొద్దని చెప్పినా…” రెడ్‌బుక్ అనేది ఒక దుష్టసంప్రదాయాన్ని కొనసాగించాలనే చంద్రబాబు ప్రభుత్వానికి సమర్థవాదం చేస్తోందని విమర్శించారు. “ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా, మా కార్యకర్తలు కూడా బుక్ నిర్వహణ ప్రారంభించారు. అన్యాయం చేసే అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో, మేం గుడ్‌బుక్‌ను కూడా రాయడం ప్రారంభించాం” అని అన్నారు. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను రాసుకుంటున్నామని, వారికి సరైన అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలొస్తాయ్. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారు
రెడ్ బుక్ మెయింటెన్ చేయడం పెద్ద పనా? మనం గుడ్ బుక్ పెడదాం
మంచిగా పని చేసిన వాళ్ల పేర్లని ఆ గుడ్ బుక్‌లో రాసుకుని అధికారంలోకి వచ్చాక ప్రమోషన్ ఇద్దాం
–@ysjagan గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు pic.twitter.com/yFeXrFWl8C
— YSR Congress Party (@YSRCParty) October 9, 2024
“మేము పార్టీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాం, కోవిడ్ వంటి మహాసంక్షోభం కూడా మా ముందుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. ప్రతి అంశంలో తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది, వివక్ష మరియు పక్షపాతం కూడా ఉంది. ప్రతి ఇంట్లో ఈ విషయం గురించి చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పనిసరిగా ఉంటాయి, కానీ కష్టాలనుంచి మాత్రమే నాయకులు పుడుతారు. నన్ను 16 నెలలు జైల్లో ఉంచి తీవ్రంగా వేధించారు. అయినప్పటికీ, ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం” అని పార్టీ నేతల సమావేశంలో జగన్ తెలిపారు.