YS Jagan Vs Lokesh : జగన్ పై లోకేష్ `యంగ్ తరంగ్ `
`పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప..`అన్నాడు శ్రీశ్రీ. అదే సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్.
- By CS Rao Published Date - 04:44 PM, Fri - 12 November 21

`పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప..`అన్నాడు శ్రీశ్రీ. అదే సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా..పోరాటం చేయాలో అర్థం చేసుకున్నాడు. అందుకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఎయిడెడ్ స్కూల్స్, కాలేజిల స్వాధీనం వివాదంపై సమరశంఖాన్ని పూరించాడు. ఉద్యమాలు ఎప్పుడూ విద్యా కేంద్రాల నుంచే బలంగా వస్తుంటాయని చరిత్ర చెబుతోంది. అనంతపురం జిల్లాలోని ఎయిడెడ్ కాలేజిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశం మీద విద్యార్థులు తిరగబడ్డారు. ఆ సందర్భంగా పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అక్కడి విద్యార్థుల తిరుగుబాటును లోకేష్ గమనించాడు. నైతిక మద్ధతుతో పాటు అండగా నిలవడానికి అనంతపురం వెళ్లాడు. వాళ్ల ఉద్యమానికి యవ్వనోత్సాహాన్ని నింపాడు. తాజాగా కాకినాడకు వెళ్లిన లోకేష్ విద్యార్థులకు అండగా నిలిచాడు. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదని విద్యార్థులు చేస్తోన్న డిమాండ్ కు మద్ధతు ఇచ్చాడు. ఏపీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎయిడెడ్ కాలేజిలు, స్కూల్స్ ఉన్నాయి. పైగా క్రిస్టియన్ మిషనరీల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు మెరుగైన ఫలితాలను సాధిస్తూ నిర్వహిస్తున్నారు. వాటన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఇటీవల నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు నుంచి విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియచేస్తున్నారు. వాళ్లకు భరోసా, ధైర్యం నింపడానికి లోకేష్ శ్రీకారం చుట్టాడు.
Also Read : Apex Council : కేసీఆర్ అబద్ధాలపై కేంద్రం ఫోకస్
ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితి కోవిడ్ సందర్భంగా ఇంటర్, టెన్త్ పరీక్షల రద్దు అంశంలో చోటుచేసుకుంది. ఆ సందర్భంగా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల పక్షాన నిలవడానికి నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజూ జూమ్ ద్వారా అనేక మంది విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాడు. ఆన్ లైన్ లోనే ఒక ఉద్యమంలాగా లోకేష్ నడిపాడు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. మరో వైపు న్యాయ పోరాటం చేస్తూ విద్యార్థులకు ఆనాడు సంపూర్ణ మద్ధతు ప్రకటించాడు. విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా సంపూర్ణ సహాయ, సహకారాలు అందించాడు. కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాలని భీష్మించింది. చివరకు విద్యార్థులతో కలిసి లోకేష్ చేసిన పోరాటం, న్యాయస్థానం ఆదేశం జగన్ ప్రభుత్వాన్ని మెడలు వంచింది. పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి జగన్ సర్కార్ కు ఆనాడు ఏర్పడింది.ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీల విషయంలోనూ లోకేష్ వ్యూహాత్మకంగా ఉద్యమాలకు ఊతం ఇస్తున్నాడు. విద్యా సంస్థల కేంద్రంగా ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకురావడానికి భారీ స్కెచ్ వేశాడు. గతంలోనూ యంగ్ తరంగ్ పేరుతో చంద్రబాబునాయుడు కాలేజి వేదికలపై ప్రోగ్రామ్‌లను చేశాడు. అందుకే 2014 ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేయగలిగాడు. యూత్, విద్యార్థులు 2014 ఎన్నికలకు ఏడాది ముందు జగన్ వైపు ఉన్నారని సర్వేలు చెప్పాయి. వాటికి చెక్ పెట్టేలా విద్యా సంస్థల్లో చంద్రబాబు అడుగుపెట్టి చర్చలకు తెరలేపాడు.
Also Read : కొవిడ్ రూల్స్ పాటించని స్కూళ్లు.. భయాందోళనలో తల్లిదండ్రులు!
అదే బాటన ఇప్పుడు లోకేష్ విద్యా సంస్థల నుంచి జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేపడానికి సన్నద్ధం అయ్యాడు. తెలుగు విద్యార్థి పరిషత్, ఎన్ ఎస్ యూ ఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ యూ..ఇలా అనేక విద్యార్థి సంఘాలు యువనేత వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్లతో ఇప్పటికే. చర్చలు జరిపిన లోకేష్ సమీప భవిష్యతులో జగన్ మీద తిరగబడేలా విద్యార్థి లోకాన్ని సన్నద్ధం చేస్తున్నాడు. సో..పరీక్షల రద్దు విషయంలో విజయం సాధించిన లోకేష్ ఎయిడెడ్ కాలేజీల స్వాధీనం వ్యతిరేక పోరాటంలోనూ పైచేయి సాధించి, 2024 దిశగా యూత్ ను రెడీ చేస్తున్నాడన్నమాట.
Related News

Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజధాని రైతులతో నారా భువనేశ్వరి
ఏపీకి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి