Covid : కొవిడ్ రూల్స్ పాటించని స్కూళ్లు.. భయాందోళనలో తల్లిదండ్రులు!
కరోనా కారణంగా పిల్లలంతా ఆన్ లైన్ క్లాసుల ద్వారా తమ చదవులను కొనసాగించారు. కేసుల సంఖ్య బాగా తగ్గడం, అన్ని రకాల వ్యాక్సిన్లు రావడంతో మళ్లీ బడిబాట పడుతున్నారు.
- By Balu J Published Date - 03:10 PM, Fri - 12 November 21

కరోనా కారణంగా పిల్లలంతా ఆన్ లైన్ క్లాసుల ద్వారా తమ చదవులను కొనసాగించారు. కేసుల సంఖ్య బాగా తగ్గడం, అన్ని రకాల వ్యాక్సిన్లు రావడంతో మళ్లీ బడిబాట పడుతున్నారు. ఇన్నాళ్లు ఆన్ లైన్ విద్యకే పరిమితమైన విద్యార్థులు.. ప్రత్యక్ష తరగతులకు అటెండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు పాఠశాలల్లో కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడంతో పిల్లలు వైరల్ ఫీవర్ తో బాధపడటంతో పాటు, కరోనా లక్షణాలు సోకినట్టు తెలుస్తోంది. ఆఫ్ లైన్ క్లాసుల తీరుపై పేరెంట్స్ సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థికి కొవిడ్ -19 అని తేలింది.
Also Read : Apex Council : కేసీఆర్ అబద్ధాలపై కేంద్రం ఫోకస్
ఈ కారణంగా గురువారం ఆఫ్‌లైన్ తరగతుల నుంచి ఆన్‌లైన్ తరగతులకు మారాల్సి వస్తోంది. పలు ప్రైవేట్ పాఠశాలలు కరోనా జాగ్రత్తలు పాటించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు కరోనా బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగానికిపైగా పాఠశాలల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. “పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు పిల్లలను పంపాలని మేనేజ్ మెంట్ బలవంతం చేయడంతో నా కొడుకును పాఠశాలకు పంపాల్సి వచ్చింది. రెండు రోజుల్లో, నా కొడుకు కోవిడ్-19 లక్షణాలు పెరగడం కనిపించాయి. అతని క్లాస్‌మేట్స్‌లో ఒకరికి వైరస్ పాజిటివ్ అని తేలినందున, ఇవాళ నేను కరోనా టెస్టుకు వెళ్లాల్సి వచ్చిందని” ఓ స్టూడెంట్ తల్లిదండ్రులు చెప్పారు.
నవంబర్ 1 నుంచి ఆఫ్‌లైన్ తరగతులను తిరిగి ప్రారంభించిన పాఠశాల, ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్ మోడ్‌కు తరగతులను మార్చాల్సి వచ్చింది. పాఠశాల యాజమాన్యం ప్రత్యక్ష తరగతులను ప్రారంభించడం వల్ల తల్లిదండ్రులకు కూడా వేరే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కొడుకు పాఠశాలకు వెళ్లి రెండు రోజులు మాత్రమే అవుతుంది. ప్రస్తుతం అతడు జ్వరంతో ఉన్నాడు’ అని మరో విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. అన్ని పాఠశాలలు కోవిడ్ -19 జాగ్రత్తలను ఖచ్చితంగా పాటిస్తున్నట్లు యాజమాన్యం హామీ ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పాఠశాలలు జవాబుదారీగా ఉండాలని, చాలా పాఠశాలల్లో కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయని, అయితే యాజమాన్యాలు నిజాన్ని దాచివేసి నెమ్మదిగా ఆన్‌లైన్ తరగతులకు మారుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Related News

Visakhapatnam: ఏపీలో తప్పిన పెను ప్రమాదం
వైజాగ్ లో పెను ప్రమాదం తప్పింది. సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోని లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.