HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Is Away From Sharmilas Sons Wedding Ceremony

YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం

YS Sharmila : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.

  • Author : Pasha Date : 18-02-2024 - 7:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

YS Sharmila : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డికి ప్రియ అట్లూరితో జరిగిన ఈ వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Sharmila) హాజరుకాలేదు. కొన్ని పనుల కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకానట్లు తెలిసింది. అయితే నూతన వధూవరులు ఇంటికి తిరిగొచ్చాక.. జగన్ స్వయంగా వారిని కలిసి ఆశీర్వాదాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు వైఎస్‌ విజయమ్మతో సహా సన్నిహితులు హాజరయ్యారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు (మూడు రోజుల పాటు) ప్యాలెస్‌లో ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి.  16వ తేదీన సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజారెడ్డి, ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 18న (ఇవాళ) ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం తలంబ్రాల వేడుక జరగనుంది.

Congratulations RajaPriya #RajaPriya #Haldi #wedding #happyforbothofyou ♥️ pic.twitter.com/qffN2ofJSq

— YS Sharmila (@realyssharmila) February 17, 2024

We’re now on WhatsApp. Click to Join

కుమారుడి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నూతన వధూవరులు ముస్తాబవగా.. మిగిలిన వారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజా రెడ్డి, ప్రియల కుటుంబసభ్యులు ఈ ఫొటోలలో కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మలు రాజా రెడ్డి పక్కన ఉండగా.. ప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.

Also Read : Actor Sunny Leone: సన్నీ లియోన్ పేరుతో కానిస్టేబుల్‌ అడ్మిట్ కార్డు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్ధం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో జనవరి 18న జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియ అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే రాజారెడ్డి చదువు పూర్తి చేసుకున్నాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మొదట విజయమ్మ ఆశీర్వదించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Sharmilas Son Wedding
  • wedding-ceremony
  • ys jagan
  • ys sharmila

Related News

Mavigun

జ‌గ‌న్ ‘మావిగన్’.. ఈ ఐడియా ఇచ్చింది ఎవ‌రంటే?!

జగన్ ఇతరుల నుండి సలహాలు, ఆలోచనలు తీసుకుంటే ఇప్పుడున్న స్థాయి నాయకుడు అయ్యేవారు కాదు. జ‌గ‌న్‌ ఎప్పుడూ తన స్వశక్తితో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతారు.

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Vishnu Kumar Raju

    Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • Former AP Legislative Council Chairman Shariff

    AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ సంచలన నిజాలు!

Latest News

  • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

  • Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

  • సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆ అధికారుల‌కే ప్రోత్సాహ‌కాలు!

  • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

  • Assam Elections: పాకిస్తానీ సోషల్ మీడియా తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి కాంగ్రెస్ నా భార్యపై ఆరోపణలు సృష్టించింది: అస్సాం సీఎం

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd