HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vishnukumar Raju Makes Sensational Remarks Against Jagan

Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 11:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vishnu Kumar Raju
Vishnu Kumar Raju

Vishnu Kumar Raju  వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల తీరుపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇజ్రాయెల్ నుంచి తెచ్చినట్లుగా చెబుతున్న ఒక ‘ఆల్కహాల్ గన్’ను మీడియాకు చూపిస్తూ… జగన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆయన వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. జగన్ తన సలహాదారుల మాటలు విని తన రాజకీయ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు.

విచిత్రమైన ఆలోచనలు చేసే సలహాదారుల ప్రభావం వల్లే జగన్ తప్పుదోవ పడుతున్నారు. వారికి కనీస సాధారణ జ్ఞానం ఉందా? అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. జగన్ గతంలో తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా రాజధాని విషయంలో చేసిన ప్రయోగాలు రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు.

అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను గత ప్రభుత్వం అనేక రకాలుగా వేధించిందని, వారిని ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై స్పష్టత లేకపోవడం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.

అమరావతికి ప్రత్యామ్నాయంగా గతంలో జగన్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన ప్రతిపాదనలపై విష్ణుకుమార్ రాజు ఘాటుగా స్పందించారు. అశాస్త్రీయమైన సలహాలు ఇచ్చే వారిని పక్కన పెట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alcohol Gun
  • Amaravati capital
  • andhra pradesh
  • AP BJP Leaders
  • ap capital
  • bjp vishnu kumar raju
  • MLA Vishnu kumar raju
  • Vishnu Kumar Raju
  • ys jagan

Related News

Accused Nithyananda Reddy

YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. గత నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. పోలీసుల వేట తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. తాజాగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం

  • Mlc Anantha Babu Arrest

    MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

  • YCP's Masterplan Behind the Kadapa Riots... A Conspiracy Against the Coalition Government!!

    కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!

  • Tdp

    TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

  • Deputy CM to arrive in AP today

    Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd