Actor Sunny Leone: సన్నీ లియోన్ పేరుతో కానిస్టేబుల్ అడ్మిట్ కార్డు.. సోషల్ మీడియాలో వైరల్..!
పరీక్షలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ (Actor Sunny Leone) పేరు, ఫోటోతో అడ్మిట్ కార్డ్ కనిపించిన ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. ఈ అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
- By Gopichand Published Date - 06:43 AM, Sun - 18 February 24

Actor Sunny Leone: ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (UPPBPB) 17 ఫిబ్రవరి 2024న రాష్ట్రం మొత్తంలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను నిర్వహించింది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. పరీక్షలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ (Actor Sunny Leone) పేరు, ఫోటోతో అడ్మిట్ కార్డ్ కనిపించిన ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. ఈ అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అడ్మిట్ కార్డుపై పరీక్ష తేదీ ఫిబ్రవరి 17గా ఉంది. దీనిపై కన్నౌజ్ పోలీసుల సైబర్ సెల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసు కన్నౌజ్ జిల్లాలోని తిర్వా పట్టణంలోని సోనేశ్రీ బాలికల కళాశాలకు సంబంధించినది. అక్కడ పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరుగుతోంది. అదే పరీక్షా కేంద్రంలో అభ్యర్థి అంకిత్ అడ్మిట్ కార్డ్‌లో సినీ తార సన్నీలియోన్ చిత్రం ముద్రించబడింది. అడ్మిట్ కార్డ్‌లో సన్నీ లియోన్ ఫోటో ఉండటంతో ఎవరో అడ్మిట్ కార్డ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది రాష్ట్రవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది.
Also Read: Pakistan Elections 2024: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ అంగీకరిస్తూ ఎన్నికల అధికారి రాజీనామా
అడ్మిట్ కార్డ్‌లో రాసిన నంబర్‌పై ఫోన్‌లో సమాచారం తీసుకోగా విద్యార్థి అంకిత్ పబ్లిక్ సర్వీస్ సెంటర్ నుండి ఫారమ్‌ను నింపినట్లు చెప్పాడు. అయితే ఆ ఫోటోను ఎలా మార్చారనే విషయం మాత్రం తెలియడం లేదు. ఈ ఫోటో మార్చడం వల్ల పరీక్షకు కూడా హాజరు కాలేకపోయాడు. ఈ అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న చిరునామా ముంబై. రిజిస్ట్రేషన్ సమయంలో సొంత జిల్లాను కన్నౌజ్‌గా పేర్కొన్నారు. ఈ అడ్మిట్ కార్డుపై అభ్యర్థులెవరూ పరీక్షకు హాజరు కాలేదని కళాశాల అధికారులు తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join
విషయం స్థానిక అధికారుల దృష్టికి వెళ్లగా.. అడ్మిట్ కార్డులో ఎడిటింగ్ జరిగిందని చెప్పారు. మిగిలిన అంశాలపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారెవరినీ వదిలిపెట్టబోమన్నారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 17, 18 తేదీల్లో కనౌజ్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 9464 మంది అభ్యర్థులు 10 పరీక్షా కేంద్రాలలో పరీక్షకు హాజరయ్యారు.