Toor Dal – Ration Shops : ఏపీలో రూ.67కే కిలో కందిపప్పు.. జనవరి దాకా సప్లై
Toor Dal - Ration Shops : ఏపీ ప్రభుత్వం వచ్చే నెల (నవంబరు) నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయనుంది.
- By Pasha Published Date - 09:56 AM, Fri - 27 October 23

Toor Dal – Ration Shops : ఏపీ ప్రభుత్వం వచ్చే నెల (నవంబరు) నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయనుంది. లబ్దిదారులకు కిలో చొప్పున కందిపప్పును అందించనుంది. 10వేల టన్నుల కందిపప్పు కావాలంటూ హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఏపీ పౌర సరఫరాల శాఖ ఆర్డర్ ఇచ్చింది. అయితే స్టాక్ లేకపోవడంతో 7,200 టన్నుల కందిపప్పు సరఫరాకు హాకా ఓకే చెప్పింది. తొలుత ఇందులో 3,660 టన్నులు, రెండో విడతలో 3,540 టన్నుల కందిపప్పు ఏపీ ప్రభుత్వానికి హాకా అందించనుంది. ఇందులో నుంచి వచ్చే నెలలో 2,300 టన్నుల కందిపప్పును రాష్ట్రంలో ప్రజలకు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 దాకా నడుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.67కు కిలో కందిపప్పును రేషన్ కార్డులు ఉన్నవారికి ఇవ్వనుంది. డిసెంబర్, జనవరిలో కూడా సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఇందుకోసం 50వేల టన్నుల కందిపప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలోని రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్రంలో వాడుకోవాలనే ప్రపోజల్ కూడా ఏపీ పౌరసరఫరాల శాఖ(Toor Dal – Ration Shops) పరిశీలనలో ఉంది.