HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Women Doctor Murder In Machilipatnam

Murder : మచిలీపట్నంలో దారుణ హ‌త్య‌కు గురైన వైద్యురాలు

మచిలీపట్నంలో గైనకాలజిస్ట్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి

  • Author : Prasad Date : 27-07-2023 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

మచిలీపట్నంలో గైనకాలజిస్ట్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. డాక్టర్ రాధ, ఆమె భర్త డాక్టర్ మాచర్ల ఎల్ మహేశ్వరరావు గత కొన్నేళ్లుగా జవ్వాపేట్‌లో తల్లి పిల్ల‌ల‌ ఆసుపత్రి నడుపుతున్నారు. వీరిద్ద‌రు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆసుపత్రిని నడుపుతున్నారు. అదే ఆసుపత్రి భవనంలోని పై అంతస్తులో నివాసం ఉంటారు. అయితే మంగళవారం రాత్రి మహేశ్వరరావు రోగులను చూసేందుకు గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పై అంతస్తుకు వెళ్లి చూడగా డాక్టర్ రాధ రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వెంట‌నే ఆమె భ‌ర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్ రాధ మెడను కోసినట్లు గుర్తించారు. ఆమె ధరించిన నగలు కూడా మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. మ‌చిలీప‌ట్నం డీఎస్పీ మాధవరెడ్డి, ఇనగూడూరు సీఐ ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అనంతరం డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లను రంగంలోకి దించారు. కేసును వీలైనంత త్వరగా ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నగలు దోచుకునేందుకే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మ‌చిలీప‌ట్నం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తరలించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • krishna district
  • machilipatnam
  • murder
  • women doctor

Related News

Arrest

Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్‌పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్

  • Murder 1

    Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd