Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
- By Latha Suma Published Date - 06:28 PM, Thu - 20 March 25

Marri Rajasekhar : మర్రి రాజశేఖర్ గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీలో అవమానాలు భరించలేక ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పటికీ రాజీనామా చేశా అన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాతే మరొక పార్టీలోకి వెళ్తున్నా. పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Read Also: Constable posts : త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ : హోం మంత్రి అనిత
కాగా, మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేశారు. ఎన్నికల్లో ఓడిన తరువాత వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు రాజీనామా చేసారు. వారి రాజీనామాలు ఆమోదం పొంద లేదు. ఇప్పుడు అయిదో ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేసారు. కొంత కాలంగా మర్రి రాజీనామా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే, జిల్లాకు చెందిన మాజీ మంత్రి అభ్యంతరంతో టీడీపీలో చేరిక అంశం పైన స్పష్టత రాలేదు. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీకి మండలిలో మెజార్టీ ఉంది. ఇక, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు పలువురు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నా వారిని వారించే ప్రయత్నాలు జరగటం లేదు. ఇటు జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు.
Read Also: SC Sub Classification : ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం