Whats Today : నారా భువనేశ్వరి బస్సుయాత్ర.. మేడిగడ్డకు కేంద్రం నిపుణులు
Whats Today : టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు.
- By Pasha Published Date - 10:07 AM, Tue - 24 October 23

Whats Today : టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకుంటారు. అనంతరం నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలోని దళిత వాడలో భువనేశ్వరి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రకు శ్రీకారం(Whats Today) చుట్టనున్నారు.
- ఇవాళ దసరా సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవును ప్రకటించారు.
- కేంద్ర జలసంఘం సభ్యులు నేడు మేడిగడ్డకు బ్యారేజీని తనిఖీ చేయనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం ఈ బ్యారేజీని పరిశీలించనుంది. 20వ పిల్లర్ ఎందుకు కుంగింది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
- ఇవాళ వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో సౌతాఫ్రికా తలపడనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాల మలల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం ఉంటుంది. ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకునేందుకు తెల్లవారేవరకు గ్రామాల మధ్య కర్రల సమరం జరుగనుంది.
- ఇవాళ సింహాచలం దేవస్థానంలో జమ్మివేట ఉత్సవం జరుగుతుంది. ఈసందర్భంగా స్వామివారు పూలతోటలో విహరించనున్నారు. రామావతారంలో లక్ష్మీ నృసింహస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 6గంటల వరకే అప్పన్న స్వామి దర్శనాలు ఉంటాయి.