HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >What Is The Criticism Of Pawan But Is Jagan Degrading Himself

CM Jagan : పవన్ ఫై విమర్శలు ఏమోకానీ జగన్ తనను తానే దిగజార్చుకుంటున్నాడా..?

134 నియోజవర్గాల్లో 3వందల 41 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్ (Jagan).. 3వేల 6వందల 48 కిలోమీటర్లు నడిచారు. 2వేల 5వందల 16 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది.

  • Author : Sudheer Date : 02-08-2023 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
What Is The Criticism Of Pawan, But Is Jagan Degrading Himself
What Is The Criticism Of Pawan, But Is Jagan Degrading Himself

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. దివంగత నేత , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy).. రాజకీయాల్లో కొత్త శ్రీకారం చూడతారని , తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకుంటాడని రాష్ట్ర ప్రజలంతా అంత అనుకున్నారు. తండ్రి మరణం తర్వాత నెలకొన్న సమస్యలు అన్ని ఇన్ని కావు..వాటిని అన్నింటిని ఎదురుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజా సంకల్పయాత్ర పేరిట నేనున్నాను..అంటూ ప్రజల్లోకి వెళ్లాడు.

2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రని ప్రారంభించారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ పాదయాత్ర చేశారు. 134 నియోజవర్గాల్లో 3వందల 41 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్.. 3వేల 6వందల 48 కిలోమీటర్లు నడిచారు. 2వేల 5వందల 16 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలతో పాదయాత్ర చేశారు. ఈ యాత్ర జగన్ ను ప్రజల్లోకి మరింత దగ్గర చేయడమే కాదు జగన్ ఇచ్చిన హామీలకు ప్రజలు ముగ్దలయ్యారు. ఒక్క ఛాన్స్ జగన్ కు ఇద్దాం..అని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు అనుకున్నారు.

రాజశేఖర్ రెడ్డే అంత బాగా అభివృద్ధి చేసారు..పేదలకోసం ఎన్నో చేసాడు..ఆయన కొడుకు చేయడా..అని ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. మా సీఎం నువ్వే అంటూ భరోసా ఇచ్చారు..ఓట్లు వేసి గెలిపించారు. ఊరు వాడ , పల్లె , పట్టణం సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సంబరాలు ఎంతోకాలం నిలువలేదు. రాను రాను జగన్ ఫై వ్యతిరేకత ప్రజల్లో మొదలైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదు. సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడంలో జగన్ విఫలమవుతూ వచ్చారు.

జగన్ (Jagan Mohan Reddy) వెంట 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవరి స్వార్థం వారే అన్నట్లు అయ్యింది. ఎంతసేపు జగన్ కు భజన చేయడమే తప్ప..మంచి సలహాలు ఇద్దాం..ప్రజలు ఇది కోరుకుంటున్నారు..ప్రజలకు ఇది చేస్తే బాగుంటుంది..రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దాం..కేంద్రం నుండి నిధులు తీసుకొద్దాం..ప్రాజెక్టులు పూర్తి చేద్దాం అనే మాట ఎవరు చెప్పారు. ఎవరికీ వారు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేద్దామంటే, జగనన్న వినడు. అధికారులు వినరు, ఎమ్మెల్యేలు కూడా వినిపించుకోరని మాటలు ప్రజల నుండి రావడం మొదలయ్యాయి. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడడం వంటివి ప్రజల్లో ఆగ్రహం తెప్పించాయి.

మైనింగ్, చెరువులు, స్థలాలు, కాంట్రాక్టులు ఆఖరికి వికలాంగుల పింఛన్ల విషయంలోనూ అవినీతి అక్రమాలే జరిగాయి. ఇవన్నీ జగన్ కు తెలుసు..కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను చూసి జనసేనధినేత పవన్ కళ్యాణ్ తన దూకుడు ను పెంచాడు. పొత్తులు పెట్టుకోనైనా సరే జగన్ (Jagan Mohan Reddy) ను గద్దె దించాలని డిసైడ్ అయ్యాడు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరు మార్చుకోవాలని..ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారని..రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని , తాగునీరుకు ఇబ్బంది పడుతున్నారని , అర్హులకు సంక్షేమ పధకాలు అందడం లేదని , ఎక్కడ చూసిన అవినీతి పెరిగిపోతుందని పవన్ చెపుతూ వచ్చాడు. అయినప్పటికీ ప్రభుత్వం..తమ తీరు మార్చుకోకపోగా.పవన్ కళ్యాణ్ ఫై వ్యక్తిగత విమర్శలు చేయడం మొదలుపెట్టింది.

ఇటీవల కాలంలో మరి ఎక్కువైపోయింది. పబ్లిక్ గా సీఎం జగన్ సైతం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టారు. వ్యక్తిగత విమర్శలకు పోకూడదని , రాజకీయాన్ని..రాజకీయంగానే చూడాలని ప్రతి ఒక్కరు అంటున్న వైసీపీ నేతలు మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. ఇదే ఇప్పుడు ప్రజల్లో జగన్ (Jagan Mohan Reddy) ను దిగజార్చేలా చేస్తూ.. పవన్ కు ఆదరణ పెరిగేలా చేస్తుంది. మొన్నటి వరకు పవన్ ను పెద్దగా పట్టించుకోని ప్రజలు సైతం ఇప్పుడు పవన్ కు ఓ ఛాన్స్ ఇద్దాం అనే ధోరణికి వచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయి..రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకను తగ్గించుకోవాలి..అందిస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అదేలా చూడాలి..రాష్ట్రంలో ప్రధాన సమస్య గా ఉన్న రోడ్లను బాగుచేయాలి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి..రాష్ట్రంలో పెట్టుబడులు పెంచాలి. ఇలాంటివన్నీ వదిలేసి నిత్యం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ప్రజలకు నచ్చడం లేదు. ముఖ్యంగా యూత్ అయితే సోషల్ మీడియా లో వైసీపీ ని ఓ ఆటాడేసుకుంటున్నారు. రావాలి జగన్.. అనేది కాస్త ఇప్పుడు పోవాలి జగన్ అనే దానిని వైరల్ చేస్తున్నారు.

ఇక వైసీపీ మంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడే అంత మంచిది. ఇప్పటివరకు తమ తమ శాఖలకు సంబదించిన విషయాల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కానీ..రాష్ట్రాన్ని మా శాఖ ద్వారా ఇంత అభివృద్ధి చేశామని కానీ , ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చామని కానీ ఎవ్వరు ఇంతవరకు చెప్పలేదు. మరో నాల్గు , ఐదు నెలలు అయితే ఎన్నికలు వస్తాయి. ఈ మూడు నెలలైనా తమ శాఖల సంబదించిన విషయాలు ప్రజలకు చెపుతామని ఎవ్వరు అనుకోవడం లేదు. అన్ని శాఖల మంత్రులు ఒకే ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అదే పవన్. జగన్ దగ్గరి నుండి కింది స్థాయి నేత వరకు ఇలా అంత పవన్ జపం చేస్తూ..ఆయన్ను మరింత పాపులర్ చేయడం..ప్రజల్లోకి తీసుకెళ్లడం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోవాలని..నేతల్లో మార్పు తీసుకరావాలని సగటు వైసీపీ అభిమాని , జగన్ ను అభిమానించే వారు కోరుకుంటున్నారు. చూద్దాం జగన్ ఏంచేస్తారో.

Also Read:  Dandruff: మీ చుండ్రు సమస్యను వదిలించుకోండిలా.. చేయాల్సింది ఇదే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • cm jagan
  • jagan
  • Janasena
  • Pawan Kalyan
  • politics
  • ysrcp

Related News

Allu Sirish Wedding

అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

వివాహ సంప్రదాయాల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన భార్యతో కలిసి తన బావగారైన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను స్వయంగా కలిసి పెళ్లి పత్రికను అందించారు.

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd