HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >What Are The Positive Aspects Of Nara Brahmani

Nara Brahmani : ‘నారా బ్రాహ్మణి’ లో అనుకూల అంశాలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పొద్దుపొడుపులా ప్రభవింబోతున్న యువ రాజకీయ నవచైతన్యం నారా బ్రాహ్మణి (Nara Brahmani).

  • Author : Hashtag U Date : 27-09-2023 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
What Are The Positive Aspects Of Nara Brahmani
What Are The Positive Aspects Of Nara Brahmani

By: డా. ప్రసాదమూర్తి

Nara Brahmani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పొద్దుపొడుపులా ప్రభవింబోతున్న యువ రాజకీయ నవచైతన్యం నారా బ్రాహ్మణి. చంద్రబాబు అరెస్టు, కోర్టు విచారణ, వాయిదాలు.. కొనసాగుతున్న నేపథ్యంలో, లోకేష్ ఢిల్లీ యాత్ర ముగించుకొని రాష్ట్రానికి రాగానే ఆయనను కూడా ఏవేవో కేసుల్లో ఇరికించి మెయిన్ స్టీమ్ పాలిటిక్స్ నుంచి తెరమరుగయ్యేలా చేయాలని అధికార పార్టీ అష్టవిధ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో, నారా బ్రాహ్మణి (Nara Brahmani) నినాదం తెలుగుదేశం శ్రేణుల్లో నవోత్తేజం నింపుతోంది. రాజకీయం ఒక చదరంగం. నువ్వు ఒక ఎత్తు వేస్తే ప్రత్యర్థి పది ఎత్తులు వేస్తాడు. ఎప్పుడు ఎవరిని ఎవరు ఎలా దిగ్బంధం చేస్తారో ఊహించడం కష్టం. ఏపీ రాజకీయాల్లో తనకు ఎదురు లేకుండా ప్రతిపక్షాన్ని మటుమాయం చేసి పరిపాలన పగ్గాలను పదికాలాలు తమ గుప్పిట పెట్టుకోవాలని చూస్తున్న వైఎస్ జగన్, ఆయన అనుచరగణం ఇప్పుడు కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆ ప్రమాదమే నారా బ్రాహ్మణి (Nara Brahmani).

వ్యక్తుల్ని తెర మరుగు చేస్తే సత్యాలను, రాజకీయాలను, ప్రజాభిప్రాయాలను, తారుమారు చేయవచ్చనుకుంటే అది జగన్ అండ్ కో వారికి ఒక పెద్ద భ్రమగానే మిగిలిపోతుందని తెలుగుదేశం వర్గాల నుంచి చైతన్యవంతమైన సంకేతాలు వస్తున్నాయి. ఆ సంకేతాల సారమే నారా బ్రాహ్మణి. చంద్రబాబు లేకపోతే ఇక తెలుగుదేశం పార్టీ లేదని, లోకేష్ కూడా అరెస్టు అయితే ఇక తెలుగుదేశం పార్టీ తిరిగి కోలుకోలేదని జగన్ వర్గీయులు భావిస్తున్నారు. విశ్లేషకులు కూడా ఇలాంటి అంచనాలే వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో కనుమరుగై, ప్రధాన ప్రతిపక్ష శక్తిగా పవన్ కళ్యాణ్ ఆవిర్భవించవచ్చు అన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి పేరు తుఫానులా ముందుకు దూసుకు రావడానికి రంగం సిద్ధం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.

ఎన్టీఆర్ నిజమైన వారసురాలు..

నారా బ్రాహ్మణి (Nara Brahmani) ఎన్నో విధాలుగా అనుకూలమైన అంశాలతో పార్టీకి కొత్త వెలుగులా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు నీడలోనే కాదు, ఆయన ఎక్కడున్నా ఆయన సూచనలతో ఆశీస్సులతో పార్టీని ముందుకు నడిపే యువ నాయకత్వం ఉందని తేల్చి చెప్పడానికి నారా బ్రాహ్మణి రంగంలోకి రాబోతున్నారు. ఇప్పటివరకు చంద్రబాబును ప్రత్యర్థి వర్గాలు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకుడిగా విమర్శలు గుప్పించాయి. ఆయన కుమారుడైన లోకేష్ కు చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ వారసులమని చెప్పుకునే హక్కు లేదని విమర్శలు కూడా చేశారు. నారా బ్రాహ్మణి విషయంలో అలా ఇక ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఆమె నందమూరి తారకరామారావు మనవరాలు. బాలకృష్ణ కూతురు. ఆ విధంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అసలైన వారసురాలుగా నారా బ్రాహ్మణి ముందుకు వస్తే ఇక విమర్శలు చేయడానికి శత్రుపక్షానికి మరో అవకాశం ఉండదు. అంతేగాక నారా బ్రాహ్మణి యువనాయకత్వానికి పార్టీలో నవచైతన్యానికి ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తారు.

చదువులో, విజ్ఞానంలో, మాటతీరులో, ప్రతిభలో, ఉపన్యాస ధోరణిలో నందమూరి వారసత్వాన్ని నారా బ్రాహ్మణి (Nara Brahmani) కొనసాగిస్తారని ఆమె ఇప్పటికే నిరూపించుకున్నారు. చంద్రబాబు కోడలిగా, లోకేష్ భార్యగా, తారక రాముని మనవరాలుగా ఎటు చూసినా నారా బ్రాహ్మణికి సానుకూలమైన అంశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆమె త్వరలో బస్సు యాత్ర ప్రారంభించి సుడిగాలిలా ఆంధ్రప్రదేశ్ ని చుట్టుముట్టే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అలనాడు నందమూరి తారక రామారావు చైతన్య రథం అధిరోహించి ఎలాంటి చైతన్యాన్ని సృష్టించారో, అలాంటి సంచలనానికి నారా బ్రాహ్మణి శ్రీకారం చుట్టుబోతుందన్న వార్త తెలుగుదేశం నాయకుల్లో, కింద స్థాయి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తానికి జగన్ వర్గం ఒకటి తలిస్తే మరొకటి జరిగేలా కనిపిస్తోంది. ఏ విధంగా చూసినా జగన్ కి రాజకీయ ప్రమాదం తప్పేటట్టుగా లేదు. నారా బ్రాహ్మణి రాక ఆ ప్రమాదానికి పెనుసంకేతం కాబోతోందని రాజకీయ వర్గాలు నమ్ముతున్నాయి.

Also Read:  TDP : లోకేశ్ ను అడ్డుకుంటే జగన్ రెడ్డికి ప్రజలు ఘోరీ కడతారు : మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • ARREST
  • chandrababu
  • nara brahmani
  • ntr
  • politics
  • tdp

Related News

Tdp 44

TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, హైటెక్ సిటీ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు నాయుడు దూరదృష్టి పార్టీకి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. నేడు 44వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో

  • Cbn Jagan

    AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Araku MP Allocates Funds for Kovur's Development

    Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

Latest News

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

  • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

  • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

  • TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?

  • ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd