CM Jagan: 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం: సీఎం జగన్
విజయవాడలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం సాయుధ బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
- Author : Balu J
Date : 15-08-2023 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం సాయుధ బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అర్హులందరికీ పథకాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం జగన్ అన్నారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని, విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నాంమని సీఎం జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు కొనసాగుతున్నాయని, రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నాం ఆయన అన్నారు.
వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని, 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశామని, వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశామని జగన్ అన్నారు. రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయని, పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశాం అని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోమని, భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టాం ఆయన గుర్తు చేశారు. వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని, 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని సీఎం జగన్ అన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చామని, పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగామని, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామని ప్రసంగంలో సీఎం ప్రస్తావించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 15, 2023
Also Read: Pumpkin: బూడిద గుమ్మడికాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా