HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >War Effect Egg Prices Have Fallen Sharply

యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 07-03-2026 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Middle East War Effect
Middle East War Effect
Egg Prices  ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో రోజుకు సుమారు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, ఇందులో కేవలం సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. మిగిలిన 2.5 కోట్ల గుడ్లను ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే, ఇటీవల స్థానిక వినియోగం తగ్గడంతో పాటు ఎగుమతులు మందగించాయి. దీనికి తోడు, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా మారింది. చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ అంతర్జాతీయ పరిణామం నేరుగా ఏపీలోని పౌల్ట్రీ మార్కెట్‌ను దెబ్బతీసింది.

ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) ఒక్కో గుడ్డు ధరను రూ.4.20గా నిర్ణయించింది. అయితే, హోల్‌సేల్ ధర ఇంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ మార్కెట్‌లో మాత్రం వినియోగదారులకు ఆ ప్రయోజనం పూర్తిస్థాయిలో అందడం లేదు. చికెన్ షాపుల్లో గుడ్డును రూ.5 నుంచి రూ.5.50కి, కిరాణా దుకాణాల్లో రూ.6 వరకు అమ్ముతున్నారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678 పలికింది. అప్పట్లో రిటైల్‌గా ఒక్కో గుడ్డును రూ.8కి విక్రయించారు. ఆ రికార్డు స్థాయి నుంచి ధరలు ఇంతలా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో కలకలం రేపుతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.3.30కి పడిపోయిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పోర్టులు, విమానాశ్రయాలు మూతపడటంతో కేవలం గుడ్ల ఎగుమతులే కాకుండా అనేక ఇతర రంగాలపైనా ప్రభావం పడుతోంది. ఉత్పత్తికి తగిన ధర రాకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Egg Exports
  • Egg Prices
  • Egg Rate Drop
  • Israel-Iran Conflict
  • National Egg Coordination Committee
  • NECC
  • Poultry Farmers

Related News

Ap Logo

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

AP Government  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అదే సమయంలో, గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం శాసన మండలిలో ఈ బిల్లు ఆమో

  • Ram Gopal Varma

    ఇది అల్లా, జీసెస్ మధ్య ఫైట్.. పోరాటంలో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా.. అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆర్జీవీ సంచలన ట్వీట్

  • Emergency

    యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు

Latest News

  • చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

  • War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు

  • రణవీర్ సింగ్ ధురంధర్ 2 ట్రైలర్‌ వచ్చేసింది..

  • Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Vijayawada Durgamma Temple: దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో 50 లక్షల బంగారం మాయం !!

Trending News

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd