HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Viveka Daughter Sunitha Couple Who Meet Cm Chandrababu

CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన వివేకా కుమార్తె సునీత దంపతులు

YS Sunitha couple who meet CM Chandrababu : వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు.

  • Author : Latha Suma Date : 17-09-2024 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viveka daughter Sunitha couple who meet CM Chandrababu
Viveka daughter Sunitha couple who meet CM Chandrababu

YS Sunitha couple who meet CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు. సీఐడీ చేత విచారణ జరిపించి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పారు. సునీత విన్నపం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలుసని చంద్రబాబు చెప్పారు. విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.

Read Also: Rajnath Singh : కేజ్రీవాల్‌కు నైతిక విలువలు లేవు..రాజ్‌నాథ్ సింగ్

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డిని గత వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీనిపై ఈరోజు సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు.

కాగా, సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని గజ్జల తరఫున వాదించిన న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత కేసులోను అవే ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. దీనిపై రాంసింగ్ న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్రిమినల్ కేసులన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని, సీబీఐ అధికారులకు ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం రక్షణ ఉందని గుర్తుచేశారు.

Read Also: Qasim Razvi : నిజాం నవాబు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ గురించి కీలక విషయాలివీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI SP Ramsingh
  • CM Chandrababu
  • Viveka PA Krishna Reddy
  • Y.S. Vivekananda Reddy murder case
  • YS Sunitha Reddy

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd