Gangi Reddy: బ్రేకింగ్.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు!
వివేకానందరెడ్డి (Viveka) హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Gangi Reddy) బెయిల్ రద్దు అయింది.
- Author : Balu J
Date : 27-04-2023 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Viveka) హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Gangi Reddy) బెయిల్ రద్దు అయింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు (High court) ఉత్తర్వులు జారీ చేసింది. మే 5వ తేదీన సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Gangi Reddy) సాక్షులను బెదిరించారు. ఆయన బయట ఉంటే సాక్షులు భయపడుతున్నారు అని సీబీఐ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు (Verdict) వెలువరించింది.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో..ఈ పిటిషన్ పై మరోసారి జరగనుంది.
Also Read: Jagga Reddy: గాంధీ భవన్ లో ఉండలేకపోతున్నా: జగ్గారెడ్డి ఎమోషన్!