HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada Mp Kesineni Nani Comments

MP Kesineni : చంద్ర‌బాబుపై అసంతృప్తిగా ఉండ‌టంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కేశినేని.. అదంతా…?

గ‌త కొద్ది నెల‌లుగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పై వ‌స్తున్న అసంతృప్తి వార్త‌ల‌పై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు

  • Author : Prasad Date : 15-08-2022 - 1:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MP kesineni
MP kesineni

గ‌త కొద్ది నెల‌లుగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పై వ‌స్తున్న అసంతృప్తి వార్త‌ల‌పై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎంపీ కార్యాల‌యంలో ఆయ‌న‌ జాతీయ జెండా ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై అసంతృప్తిగా ఉన్నాన‌ని నేను ఎవ‌రికి చెప్పానంటూ ఓ మీడియా ప్ర‌తినిధికి కౌంట‌ర్ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థ‌లు ప‌ని క‌ట్టుకుని త‌న‌పై వార్త‌లు రాస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీఆర్‌పీల కోస‌మో.. వ్యక్తిగత ఎజెండాతోనో కాకుండా సమాజం పట్ల బాధ్యతతో మీడియా ప్ర‌వ‌ర్తించాల‌ని ఎంపీ కేశినేని నాని అన్నారు. త‌న‌కు అధిష్టానానికి మ‌ధ్య ఎలాంటి గ్యాప్ లేద‌ని.. పార్టీకోసం ప‌ని చేస్తున్నాన‌ని ఎంపీ నాని తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారం, ప్రైవేట్ వ్యవహారం కాదని.. మహిళలకి సంబంధించిన విషయమని కేశినేని నాని అన్నారు. రాజకీయ నాయకులు చాలా నిస్వార్థంగా పని చెయ్యాలని సూచించారు. పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు ఒక్క కారు స్టిక్కర్ ను మాత్రమే ఇస్తుంద‌ని.. ప్రజాప్రతినిధుల నకిలీ కారు స్టిక్కర్ ను వాడుకొని కొన్ని సందర్భాలలో తీవ్రవాద దాడులు చేశారు. తన విజయవాడ, హైదరాబాద్ కార్లపై ఎక్కడైనా ఎంపీ స్టిక్కర్‌ కనపడిందా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తన ఢిల్లీ కారుకు మాత్రమే ఎంపీ స్టిక్కర్‌ ఉంటుందని, ఆ కారులో తన కుమార్తెను కూడా తిరగనివ్వనని కేశినేని నాని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • MP Kesineni nani
  • tdp
  • TDP. YCP
  • vijayawada

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

  • Survey

    Electoral : విరాళాల్లో బిజెపి సూపర్ హిట్

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd