HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayasai Reddys Sensational Tweet On Tamil Nadu Politics

Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayasai Reddy's Sensational Tweet on Tamil Nadu Politics
Vijayasai Reddy's Sensational Tweet on Tamil Nadu Politics

తమిళనాడులో మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ కేబినెట్ కూర్పు, ప్రమాణ స్వీకారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Today’s oath-taking ceremony of Tamil Nadu’s new Ministers will stand as a reminder of how the @INCIndia chose to snap ties with one of its oldest allies, the DMK over just 2 state minister posts, despite the DMK consistently standing with the Congress in Parliament. Politics may…

— Vijayasai Reddy V (@VSReddy_MP) May 21, 2026

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఏపీ రాజకీయాలు, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, దేశంలో ఇంధన కొరత, ఏపీ రాజధాని అమరావతి, తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడం.. ఇలా ప్రతి అంశంపై తన అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం తర్వాత నుంచి తాజాగా అక్కడ మంత్రివర్గం ప్రమాణస్వీకారం వరకు అంశాల వారీగా స్పందించారు. తాజాగా విజయ్ కేబినెట్‌లో కాంగ్రెస్ చేరడం, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంపై విజయసాయిరెడ్డి స్పందించారు.

This extreme #Heatwave across India is a reminder that in just 3 years, the General Elections and AP Assembly Elections are scheduled to coincide during peak summer. With temperatures consistently above 40°C, expecting lakhs of people to gather for rallies, sabhas, and political…

— Vijayasai Reddy V (@VSReddy_MP) May 21, 2026

తమిళనాడులో ఇవాళ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చూస్తే కాంగ్రెస్‌వాళ్ల తీరు ఎలా ఉందో అర్థమవుతుంది. తన పాత మిత్రపక్షాలలో ఒకదానితో బంధాన్ని తెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయించుకుందో గుర్తుచేసే విధంగా ఉంది. పార్లమెంటులో డీఎంకే కాంగ్రెస్‌కు అండగా నిలుస్తోంది. కేవలం రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం తన చిరకాల మిత్రపక్షమైన డీఎంకేతో సంబంధాలను తెంచుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. రాజకీయాలు అధికారం గురించే కావచ్చు, కానీ పొత్తులకు నమ్మకం, విధేయత కూడా అవసరం. ఇది “మహా తమిళనాడు ద్రోహం” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ కేబినెట్‌లోకి చేరడంపై విజయసాయిరెడ్డి స్పందించారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఈ తీవ్రమైన వేడిగాలుల తీవ్రత కనిపిస్తోంది. కేవలం మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే జరగనున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నిలకడగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ర్యాలీలు, సభలు, రాజకీయ ప్రచారాల కోసం లక్షలాది మంది ప్రజలు గుమిగూడతారనే అంచనాలు ఉంటాయి. ఇది ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను కొన్ని నెలలు ముందుకు జరపడాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాని మోదీని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని విజయసాయిరెడ్డి అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIADMK
  • cabinet ministers
  • CM Vijay
  • dmk
  • tamil nadu politics
  • Tamilaga Vettri Kazhagam (TVK)
  • Vijaya Sai Reddy
  • Vijaya Sai Reddy Latest Tweet
  • Vijaya Sai Reddy Tweet

Related News

Tvk Vijay Ntr

Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సచివాలయంలో పని సంస్కృతి పూర్తిగా మారుతోంది. ఆయన సమయపాలనను కచ్చితంగా పాటించడం ప్రభుత్వ శాఖలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు విభాగాల్లో ఉద్యోగుల హాజరుపై కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కార్యాలయాల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రక

  • Vijay Takes Sensational Decision

    Cm Vijay: లంచం అడిగితే..? సీఎం విజయ్ సంచలన నిర్ణయం

  • Vijay TVK

    Cm Vijay: ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Latest News

  • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

  • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

  • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

  • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd