Venu Swamy: మళ్లీ పవన్‌పై బాంబ్ పేల్చిన వేణుస్వామి
పవన్ ఎప్పటికీ సీఎం కాలేడంటూ.. హాట్ కామెంట్స్ చేశారు వేణు స్వామి
- Author : manojveeranki
Date : 08-05-2024 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
Venu Swami: పొలిటికల్ జోష్యాలు చెప్పడంతో…. వేణు స్వామికి ఎనలేని క్రేజ్ ఏర్పడింది. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ.. సోషల్ మీడియాలో ఫ్యామస్ అయ్యారాయన. తెలంగాణ ఎన్నికల్లో… కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని.. రెండు సంవత్సరాలు ముందు నుండే చెప్పుకొచ్చారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి… కేటీఆర్‌ను యువరాజుగా చేస్తాడని కూడా తేల్చేశారు. ఐతే… ఏపీలో జగన్‌కు నిత్యం ఫీవర్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో అవే మాటలు చెబుతున్నారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా… వేణు స్వామి ఒక కీలక ప్రకటన చేశాడు. టీడీపీ చేతిలో పవన్ మోసపోవడం పక్కా అని తేల్చే చెప్పారు. పవన్ ఎప్పటికీ సీఎం కాలేడంటూ.. హాట్ కామెంట్స్ చేశారాయన. అంతటితో ఆగకుండా… పవన్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని.. ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదని తేల్చేసాడు. జాతకరీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు పడదని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం అయితే.. పవన్ ది ఉత్తరాషాడం మకర రాశి అని.. వీళ్ళిద్దరికీ పొసగదని జాతక విశ్లేషణ చేశారు. వీళ్ళ జాతకం ప్రకారం… ఓటు బదిలీ కూడా జరగదని తేల్చి చెప్పారు. పవన్‌తో తనకు ఎలాంటి పంచాయితీ లేదని.. కేవలం ఆయన జాతకం ప్రకారమే జోష్యం చెబుతున్నానని స్వామి క్లారిటీ ఇచ్చారు.
ఐతే… ఇదే మాదిరిగా తెలంగాణలో కూడా జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి విషయంలో కూడా వేణు స్వామి ఇలానే మాట్లాడారు. ఆయన జాతకం అస్సలు బాగాలేదని.. ఆయనకు సీఎం అయ్యే యోగ్యత లేదని కూడా చెప్పారు. మొదటి స్థానంలో బీఆర్ఎస్, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని…. ఆనాడు వేణు స్వామి చెప్పారు. కానీ…ఎవరూ ఊహించనట్టుగా రికార్డ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకుంది. రేవంత్ సీఎం అయ్యారు. ఆరు నెలలపాటు తన పదవీ కాలాన్ని కొనసాగించగలిగారు. సార్వత్రిక ఎన్నికల్లో సైతం మెజారిటీ ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే స్థితిలో ఉంది. అయితే తెలంగాణలో వేణు స్వామి జోష్యం ఫలించలేదు. ఇప్పుడు అదే వేణు స్వామి పవన్ పర్టిక్యులర్ గా ఫెయిల్యూర్ నేత అని చెప్పడంపై జన సైనికులు మండిపడుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టే.. వేణు స్వామి జోష్యాలు కూడా ఫలించవని తేల్చి చెబుతున్నారు.