HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vallabhaneni Vamsi Bail Ap Government Supreme Court Petition

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బెయిల్.. విడుదలయ్యే అవకాశం.. కానీ

Vallabhaneni Vamsi : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకవైపు బెయిల్ ఊరట కలగగా, మరోవైపు సుప్రీంకోర్టు విచారణతో అతడి విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

  • Author : Kavya Krishna Date : 01-07-2025 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vamsi
Vamsi

Vallabhaneni Vamsi : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకవైపు బెయిల్ ఊరట కలగగా, మరోవైపు సుప్రీంకోర్టు విచారణతో అతడి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. తనపై నమోదైన 10 కేసుల్లోనూ బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటపడతారని అనుకున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి నూతన మలుపు తెచ్చింది.

Kavya Maran : సోషల్ మీడియా మీమ్స్‌పై తొలిసారి స్పందించిన కావ్య మారన్

వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లా నూజివీడు కోర్టు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతుల ప్రకారం, రూ. లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంది. అలాగే, వారానికి రెండు సార్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంది. ఇదివరకు నమోదైన కేసులన్నింటిలోనూ వంశీకి ఇదే తరహాలో బెయిల్ లభించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వంశీకి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ వేసిన ఆ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.

Pregnant lady : పుట్టబోయే బిడ్డ కోసం గర్బిణీలు మహిళలు తప్పక చేయించాల్సిన స్కానింగ్స్ ఏంటంటే?

దీని ఫలితంపై వంశీ విడుదల తదుపరి ప్రక్రియ ఆధారపడి ఉంది. గత ఫిబ్రవరిలో హైదరాబాదులోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద పలువురు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వంశీ, అనంతరం తిరిగి జైలుకు తరలించబడ్డారు. చివరికి అన్ని కేసుల్లో బెయిల్ సాధించినా, సుప్రీంకోర్టులో విచారణకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • ap politics
  • bail petition
  • fake housing plots case
  • Gannavaram Constituency
  • political cases
  • SC ST Atrocities Act
  • Supreme Court
  • Vallabhaneni Vamsi
  • ysrcp leaders

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd