Viveka Murder Case: వర్మ ‘నిజం’లో వివేకా హత్య!
సంచలనం రేపుతున్న వివేకా హత్య కేసు రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది.
- Author : Balu J
Date : 24-04-2023 - 3:11 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో వివేకా హత్య కేసు (Viveka Murder Case) తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయమై హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు సైతం కీలక తీర్పు ఇచ్చినా కొలిక్కి రాలేదు. సంచలనం రేపుతున్న వివేకా హత్య కేసు రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) రియాక్ట్ కాబోతున్నారు. వివేకా హత్య కేసులో నిజనిజాలు తెలిపేందుకు ‘నిజం’ (Nijam) ఛానల్ తో ముందుకు రాబోతున్నాడు. వివేకా హత్య కేసు ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే కోణాల్లో వర్మ సంచలన నిజాలు ఆ ఛానల్ ద్వారా బయటపెట్టబోతున్నాడు.
“నేను ప్రారంభించబోయే ” నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి (Unknown Facts).. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది. అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు (Death) నటిస్తుంది. నిజాన్ని చేధించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్ .. అనాలిసిస్ ద్వారా , టెక్నాలజీ ద్వారా , సర్కమ్ స్టాన్సేస్ ద్వారా అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సంట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చు’’ అంటూ వర్మి రియాక్ట్ అయ్యాడు.
నిజం”ఛానల్ లో కేవలం పొలిటికల్ (Political) కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి ప్రతి ఎపిసోడ్ లో ,నేనే కాకుండా రకరకాల ఎక్స్పర్ట్స్, థింకర్స్ , రీసెర్చర్స్ వేరే వేరే టాపిక్స్ ని కూడా అనలైజ్ చేయబోతున్నాడు వర్మ.
” నిజం ” ఛానల్ (First Episode) లోని మొదటి ఎపిసోడ్ ” వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా ? “ వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు , ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక అసలు నిజాలన్నింటినీ కూడా తవ్వి తీయడమే “నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం’’ అని వర్మ అన్నాడు. వివేకా (Viveka) హత్య వెనక నిజం లో అబద్దముందా ? అనే ఎపిసోడ్ రిలీజ్ 25 న సాయంత్రం 4 గంటలకు ప్రసారం కానుంది.
Also Read: IT Raids: వైట్ ఎంత? బ్లాక్ ఎంత? ప్రభాస్, అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై ఐటీ ఆరా!