2 killed : విజయనగరంలో విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కుమరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- By Prasad Published Date - 01:09 PM, Sat - 9 July 22

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కుమరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు అడ్డాల లక్ష్మి (47), అడ్డాల అశోక్ కుమార్ రాజు (5)గా గుర్తించారు. ఘటన జరిగిన తరువాత స్థానికులు అంతా అక్కడికి చేరుకుని శిథిలాల కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన ముగ్గురిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.