TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం
- By Kavya Krishna Published Date - 10:18 AM, Sun - 3 March 24

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక దర్శనం (రూ. 300) టికెట్లను పెంచనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ‘వీఐపీ, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవల టికెట్లను తగ్గించి ఎస్ఎన్డీ, ఎస్ఈడీ టికెట్ల కోటా పెంచుతాం. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో రికమెండేషన్ లెటర్లపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఉండదు. గత నెలలో 19.06 లక్షలమంది తిరుమలకు రాగా, హుండీ కానుకలుగా రూ.111.71 కోట్లు లభించాయి’ అని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాకుండా.. భక్తులకు సౌకర్యార్థం క్యూలైన్ల వద్ద తాత్కాలిక పందిళ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వసతి గురించి ఈఓ మాట్లాడుతూ సాధారణ భక్తుల కోసం 85 శాతం గదులు కేటాయించామన్నారు. కొండలపై 7,500 గదులు ఉన్నాయని, ఏ సమయంలోనైనా 45 వేల మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా ఉందన్నారు. వేసవిలో తిరుమలలో వసతి పరిమితంగా ఉంటుందని, భక్తులు తిరుపతిలోనే వసతి పొందాలని టీటీడీ సూచించింది. వేసవి డిమాండ్‌ను తీర్చేందుకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో టీటీడీ ఉచిత అన్నప్రసాద వితరణను ప్రారంభించింది
ఇదిలా ఉంటే.. టీటీడీ దేవస్థానానికి చెందిన జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి APPSC దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే TTD డిగ్రీ, ఓరియంట్ కాలేజీల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా లెక్చరర్ల పోస్టులకు ఈ నెల 7 నుంచి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని APPSC తెలిపింది. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in ను సంప్రదించాలి.
Also Read : Sreemukhi: పెళ్లి గురించి అలాంటి వాఖ్యలు చేసిన శ్రీముఖి.. ఆ ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయంటూ?