TTD : ఈ తేదీల్లో వారు తిరుమలకు రావద్దు…!!
వరుస సెలవుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ...వరుస సెలవులు రావడంతో మళ్లీ రద్దీ నెలకొనే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
- Author : hashtagu
Date : 10-08-2022 - 6:16 IST
Published By : Hashtagu Telugu Desk
వరుస సెలవుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ…వరుస సెలవులు రావడంతో మళ్లీ రద్దీ నెలకొనే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 11 నుంచి 15 వరకు తేదీ వరకు సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.
రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు కూడా ప్రణాళిక బద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకోని రావాలంటూ టీటీడీ స్పష్టం చేసింది.