HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ttd Chairman Distributes Vada In Tirumala Anna Prasad

TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్

అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు.

  • Author : Latha Suma Date : 06-03-2025 - 12:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TTD Chairman distributes 'Vada' in Tirumala Anna Prasad
TTD Chairman distributes 'Vada' in Tirumala Anna Prasad

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. కొండపై మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు‌ భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించామన్నారు.

TTD Chairman distributes 'Vada' in Tirumala Anna Prasad

TTD Chairman distributes ‘Vada’ in Tirumala Anna Prasad

TTD Chairman distributes 'Vada' in Tirumala Anna Prasad

TTD Chairman distributes ‘Vada’ in Tirumala Anna Prasad

Read Also: Bombs Dropped : యుద్ధ విమానం తప్పిదం.. జనావాసాలపై 8 బాంబులు

ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

TTD Chairman distributes 'Vada' in Tirumala Anna Prasad

TTD Chairman distributes ‘Vada’ in Tirumala Anna Prasad

TTD Chairman distributes 'Vada' in Tirumala Anna Prasad

TTD Chairman distributes ‘Vada’ in Tirumala Anna Prasad

Read Also: YS Sharmila : విజయవాడలో ఇల్లు కొన్న షర్మిల.. ఎందుకో తెలుసా ?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu Naidu
  • ttd
  • TTD Chairman BR Naidu
  • vada
  • Vengamamba Anna Prasad Bhavan

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఒక భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఆ బామ్మ 116 ఏళ్ల వయస్సులోనూ కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారని.. ఆ భ

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd