HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Top 10 Beaches Of Andhra Pradesh

ఏపీలోని టాప్-10 బీచ్‌ల గురించి మీకు తెలుసా..

ఏపీ బీచ్‌లు టూరిజం డెస్టినేష‌న్‌గా మారుతోంది. తీర‌ప్రాంతాల్లోని బీచ్‌లు సంద‌ర్శ‌కుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. ఏపీలోని ప్ర‌ముఖ బీచ్‌లు ఏంటి? ఓ సారి చూద్దాం..

  • Author : Hashtag U Date : 26-10-2021 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

సముద్రం దగ్గరకు వెళ్తే చాలు..మనసు గాల్లో తేలిపోతుంది. అల్లంత దూరం నుంచే తీరాన్ని తాకే అలలను చూస్తుంటే చిన్నపిల్లలు అయిపోతాం. అక్కడ ఎంత సేపు గడిపినా ఇంటికి తిరిగి వెళ్లాలనే అనిపించదు. అందుకే, బీచ్‌కు వెళ్దామంటే చాలు..చిన్నపిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా ఎగిరి గంతేస్తారు. ఏపీలో ఉన్న విశాల సముద్రతీరంలో ఆహ్లాదాన్ని పంచే బీచ్‌లు చాలానే ఉన్నాయి. వీటిలో అత్యధిక బీచ్‌లు విశాఖ జిల్లాలోనే ఉన్నాయి.

బరువా బీచ్:
శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్రతనయ నది సమీపంలో ఉన్న బరువా బీచ్‌.. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. సోంపేటకు ఈ బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది. ఈ బీచ్ సమీపంలోని పురాతన ఆలయాలు, లైట్ హౌస్‌లు మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి.

భీమునిపట్నం బీచ్..
విశాఖ జిల్లాలో ఉన్న భీమునిపట్నాన్ని భీమిలి అని కూడా పిలుస్తారు. గోస్తానీ నది పాయ ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. విశాఖపట్నం నుంచి 20 కిమీలు ప్రయాణిస్తే ఈ భీమిలికి చేరుకోవచ్చు. ఇక్కడి బీచ్ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.

మంగినపూడి బీచ్..
విజయవాడకు 75 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం సమీపంలో ఈ బీచ్ ఉంది. సెలవు దినాల్లో ఈ బీచ్‌లో ఇసుక కూడా కనిపించనంత జనం ఉంటారు. 2004 సునామీ తర్వాత ఈ బీచ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో ఇందులో స్నానాలు చేయడం ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ బీచ్ సమీపంలో ఉన్న చిలకలపూడి గిల్ట్ నగల తయారీకి ప్రసిద్ధి.
మేపాడు బీచ్..
నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. అందమైన బీచ్‌లలో ఇదీ ఒకటి. ఇక్కడ తీరంలో స్నానం చేస్తూ, నడుస్తూ ఎంత సేపైనా సమయం గడిపేయవచ్చు. ఇక్కడ పర్యటకుల కోసం పర్యాటక బోట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.


ఆర్కే బీచ్..
విశాఖలో ముఖ్యమైన బీచ్ ఇది. నిత్యం పర్యటకులతో కిటకిటాలడే ఈ బీచ్‌లో స్నానం చేయడం ప్రమాదకరం. ఈ బీచ్ సమీపంలో ఉన్న రామకృష్ణ మిషన్ పేరునే ఈ బీచ్‌కు పెట్టారు. ఇక్కడి నుంచి డోల్ఫిన్ నోస్ పర్వతం చాలా అందంగా కనిపిస్తుంది.

రుషికొండ బీచ్..
విశాఖకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుషికొండ బీచ్.. మీకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. అర్ధచంద్రాకారంలో ఉండే ఈ బీచ్‌లో రిసార్టులు, వినోద కేంద్రాలు, స్పీడ్ బోట్లు, వాటర్ స్కీ, విండ్ సర్ఫింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి.


యారాడ బీచ్..
విశాఖకు 15 కి.మీ.ల దూరంలో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ మిగతా సముద్రతీరాలు కంటే భిన్నంగా ఉంటుంది.
సూర్యలంక బీచ్..
గుంటూరు జిల్లాలోని బాపట్ల సమీపంలో ఈ బీచ్ ఉంది. ఇది నగరానికి దూరంగా ఉండటం వల్ల సాధారణ రోజుల్లో రద్దీ ఉండదు. కేవలం వారాంతాల్లో మాత్రమే రద్దీ కనిపిస్తుంది.

ఓడరేవు బీచ్..
విజయవాడకు 100 కి.మీ.ల దూరంలో చీరాలకు 6 కి.మీ.ల దూరంలో ఈ బీచ్ ఉంది. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్తుంటారు. వారు పట్టుకున్న చేపలను ఇక్కడికి వచ్చే పర్యటకులకు అమ్ముతారు. జాలర్లు పర్యటకులను సైతం పడవల్లో ఎక్కించుకుని సముద్రంలోకి తీసుకెళ్తారు.

వాకలపూడి బీచ్..
కాకినాడ సమీపంలో ఉన్న ఈ బీచ్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇది మడా అడవులకు సమీపంలో ఉంది. ప్రభుత్వ ఏటా ఇక్కడ కాకినాడ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • beach
  • tourism
  • travel

Related News

Rising COVID-19 cases in AP

COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయతాండవం ఎవ్వరూ మరచిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షించగా, అవి RF 5

  • 9 arrested in Guntur case involving the stripping of a woman.

    Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

    Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • YouTuber Ravan's remand extended again.

    Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd