Chittoor District: పాడె మోస్తూ ముగ్గురు మృతి.. అంత్యక్రియల్లో విషాదం
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని అంత్యక్రియలకు పాడెపై తీసుకెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
- Author : News Desk
Date : 16-06-2023 - 9:09 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్తూరు జిల్లా (Chittoor District) లో విషాదం చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని అంత్యక్రియలకు పాడెపై తీసుకెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు మృతి (Three people died) చెందారు. ఈ విషాద ఘటన కుప్పం (Kuppam) మండలం తంబగానిపల్లె (Tambaganipalle) లలో చోటు చేసుకుంది. తంబగానిపల్లెకు చెందిన రాణి అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె మృతదేహానికి శుక్రవారం అత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీంతో ఆమె మృతదేహాన్ని పాడెపై పడుకోబెట్టి అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు పాడెకు తగిలాయి. పాడె మోస్తున్నవారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు తిరుపతి, రవీంద్రన్, మునప్పగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు వేలాడి ఉండటాన్ని గమనించక పోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
Dragon Fruit: వేసవిలో ఆ పండు తింటే చాలు.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో?