Dragon Fruit: వేసవిలో ఆ పండు తింటే చాలు.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో?
డ్రాగన్ ఫ్రూట్.. బహుశా ఈ ఫ్రూట్ ని ఇష్టపడిన వారు ఉండరేమో. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. పింక్ అలాగే వ
- By Nakshatra Published Date - 08:10 PM, Fri - 16 June 23
డ్రాగన్ ఫ్రూట్.. బహుశా ఈ ఫ్రూట్ ని ఇష్టపడిన వారు ఉండరేమో. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. పింక్ అలాగే వైట్ కలర్ లో మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్ లభిస్తూ ఉంటుంది. ఇవి తినడానికి కాస్త చప్పగా ఉంటాయి. కానీ వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మన ప్రాంతాల్లో ఈ పండు చాలా తక్కువగా కనిపిస్తూ పండుతూ ఉంటుంది. ఎడారి ప్రాంతాల్లో పెరిగే పండు. ఈ పండ్లను అమెరికా, మెక్సికో ఎడారుల్లో ఎక్కువగా పండిస్తారు. ఈ విదేశీ పండు ఇటీవల కాలంలో మార్కెట్లలలో ఈ పండు విరివిగా దొరుకుతున్నాయి.
ఈ పండ్లు మాల్స్‌లో అమ్మకానికి ఉంచబడతాయి. ఇది భారతదేశానికి ఖరీదైన పండు. ఒక్కొక్క కాయ 80 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. పండు కాస్త ఖరీదైనపై అయినప్పటికీ ప్రయోజనాలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా బరువు తగ్గాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా డైటింగ్ కోసం ఈ పండు తయారు చేస్తారు. అంతేకాదు, మీ శరీర బరువును ఆరోగ్యకరమైన రీతిలో నియంత్రించడం లో ఇది ఉపయోగపడుతుంది. అదే కారణంగా, చెర్రీ కంటే ఇది మంచి పండు అని చెప్పబడింది. ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. లోబీపీ, హైబీపీ వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ డ్రాగన్ ఫ్రూట్‌కు సూపర్ పవర్ ఉంది.
అదే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే సామర్థ్యం, అసంతృప్త కొవ్వు కరగని కొవ్వు మొత్తాన్ని తగ్గించి, గుండె పరిస్థితిని జాగ్రత్తగా చూసుకుంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాగా డ్రాగన్ మీ జీర్ణవ్యవస్థను శుభ్రపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ మీ శరీరం చెడు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. వీటిల్ ఉండే మంచి ప్రొటీన్ కంటెంట్ వల్ల మీ శరీరాన్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. క్యాన్సర్ కంట్రోలర్ డ్రాగన్ ఫ్రూట్లో క్యాన్సర్‌తో పోరాడే కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని బీటాసైనిన్స్ కంటెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సెల్యులార్ డ్యామేజ్‌ని కూడా రిపేర్ చేస్తాయి డ్రాగన్ ఫ్రూట్లో ఉండే అధిక ఫైబర్ వాటర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి వేసవిలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ని తినడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.