Durgamma Temple: అపచారం.. దుర్గమ్మ గుడిలోకి చెప్పులతో ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు, వీడియో ఇదే!
ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ అపచారంపై పోలీసులు, దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, పలు హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
- By Gopichand Published Date - 03:03 PM, Tue - 23 September 25

Durgamma Temple: పవిత్రమైన నవరాత్రుల వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ గుడిలో (Durgmmaa Temple) అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు యువకులు చెప్పులతో గుడిలోకి ప్రవేశించి కలకలం సృష్టించారు. ఆలయ అధికారులు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ ఈ సంఘటన జరగడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు.
ఘటన వివరాల్లోకి వెళితే.. మంగళవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు యువకులు ఆలయ ప్రధాన ద్వారం నుంచి అంతరాలయానికి అతి సమీపంలోకి చెప్పులతో వచ్చేశారు. సాధారణంగా ఆలయంలోకి భక్తులు చెప్పులు ధరించకుండా ప్రవేశించడానికి కట్టుదిట్టమైన నిబంధనలు ఉంటాయి. అంతేకాకుండా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రత మరింత పటిష్టం చేశారు. అయినప్పటికీ వందలాది మంది భద్రతా సిబ్బందిని దాటుకుని ఈ యువకులు పాదరక్షలతో గుడిలోకి ఎలా వచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Also Read: CM Revanth: మేడారం అభివృద్ధి మనందరి భాగ్యం, 18 సార్లు అమ్మవార్లను దర్శించుకున్నాను: సీఎం రేవంత్
అపచారం.. దుర్గమ్మ గుడిలోకి చెప్పులతో ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు#AndhraPradesh #VijayawadaUtsav2025 pic.twitter.com/TF9QfC61G0
— Gopichand (@GThanuru) September 23, 2025
ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ అపచారంపై పోలీసులు, దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, పలు హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటనపై దేవస్థానం అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఎవరినీ ఇంకా అదుపులోకి తీసుకోలేదు. దీనిపై పోలీసుల వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.