AP Floodwaters: దక్షిణ కోస్తాలో వరద బీభత్సం..కడపలో ముగ్గురు మృతి, 30 మంది గల్లంతు
దక్షిణ కోస్తాలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృతి చెందారు. మరో 30 మంది గల్లంతు అయ్యారు.
- Author : CS Rao
Date : 20-11-2021 - 12:28 IST
Published By : Hashtagu Telugu Desk
దక్షిణ కోస్తాలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృతి చెందారు. మరో 30 మంది గల్లంతు అయ్యారు.వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భారీ వరదల కారణంగా వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. తిరుమల కొండల్లోని ప్రధాన ఆలయానికి ఆనుకుని ఉన్న నాలుగు మాడ వీధులు జలమయమయ్యాయి.
Live Updates : వైజాగ్‌కు మరో గండం
తిరుమల కొండలపై అనేక చెట్లు నేలకూలడంతో పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే రహదారిని మూసివేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ , ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్షాలతో అతలాకుతలమైన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించాడు. కడప జిల్లాలో వరదల కారణంగా ముగ్గురు మృతి చెందగా, మరో 30 మంది గల్లంతయ్యారు. చెయ్యేరు నది పొంగి, ఆనకట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటడంతో నందలూరులోని స్వామి ఆనంద దేవాలయం కూడా నీట మునిగింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. రాబోవు 24 గంటల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.