Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!
- By Vamsi Chowdary Korata Published Date - 12:46 PM, Sat - 1 November 25
శ్రీకాకుళంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది. అయితే, ఆలయంలో ఎలాంటి అధికారులు, ఆలయ సిబ్బంది భక్తుల ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు భక్తులు ఆరోపిస్తున్నారు


Srikakulam Stampade
బ్రేకింగ్ న్యూస్ ఏపీలో తీవ్ర విషాదం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట తొక్కిసలాటలో 9 మంది మృతి, పలువురికి గాయాలు#AndhraPradesh #HarimukundaPanda #KashibuggaTemple #venkateswaraswamytemple #srikakulamStampade #HashtagU pic.twitter.com/UOAEuHzXFF
— Hashtag U (@HashtaguIn) November 1, 2025