BRS Party : బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు!
భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,
- Author : Maheswara Rao Nadella
Date : 03-01-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ (BRS) కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు టీజే ప్రకాశ్ (అనంతపురం), తాడివాక రమేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్ నాయుడు (కాపునాడు, ప్రధాన కార్యదర్శి), రామారావు (ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Also Read: India vs Sri Lanka: నేటి నుంచే శ్రీలంకతో T20 సిరీస్.. ఆ ముగ్గురు లేకుండానే బరిలోకి..!