IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!
- By Vamsi Chowdary Korata Published Date - 12:44 PM, Wed - 1 October 25

Amrapali ఆమ్రపాలి ఐఏఎస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు.తెలంగాణలో పనిచేసే సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గత ఏడాది జరిగిన పరిణామాలతో పాటు విభజన నాటి కేటాయింపులతో ఆమ్రపాలి తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాల్సి వచ్చింది.తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యాక ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్ చేశారు.ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీగా గతేడాది అక్టోబర్‌లో నియమించిన సంగతి తెలిసిందే.అలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.అయితే ఈ ఏడాది జూన్‌లో ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట దక్కింది.ఆమెను తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే జూన్‌లో క్యాట్ తీర్పు ఇచ్చినా ఆమె ఎందుకు ఇంకా తెలంగాణకు వెళ్లలేదు.ఇంకా ఏపీలోనే ఎందుకు కొనసాగుతున్నారనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.తెలంగాణకు వెళ్లకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయట.
ఈ ఏడాది జూన్‌లో ఐఏఎస్ ఆమ్రపాలిని తెలంగాణకు తిరిగి కేటాయించారు.క్యాట్ తీర్పు వచ్చినా ఆమె ఏపీ కేడర్‌లోనే కొనసాగుతున్నారు.క్యాట్ నుంచి తీర్పు వచ్చినా ఆమ్రపాలి తిరిగి తెలంగాణకు వెళ్లేందుకు డీవోపీటి నుంచి ఆర్డర్‌లు రాలేదని తెలుస్తోంది.అందుకే ఇంకా ఏపీలోనే కొనసాగుతున్నారట.ఏపీ టూరిజం ఎండీ ఏపీటీఏ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారట.ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో, విజయవాడలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఆమ్రపాలి కనిపించారు. దీంతో ఆమె ఇంకా తెలంగాణకు ఎందుకు వెళ్లలేదనే చర్చ జరుగుతోంది.అయితే డీవోపీటీ నుంచి ఆర్డర్స్ రాగానే తిరిగి ఆమె తెలంగాణకు వెళతారని సమాచారం.
క్యాట్ ఆమె వాదనతో ఏకీభవించి, కేంద్రం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తూ తెలంగాణకు కేటాయించాలని ఆదేశించింది.ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొందరు అధికారులకు కఠినంగా అమలు చేస్తూ, మరికొందరికి సడలింపు ఇవ్వడాన్ని క్యాట్ తప్పుబట్టింది.ఈ మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని క్యాట్ అభిప్రాయపడింది.పరస్పర బదిలీలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేయడం సరికాదన్న ఆమ్రపాలి వాదనను క్యాట్ సమర్థించింది.అందుకే, ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.ఆమెను తెలంగాణకు కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.