HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >They Crossed The Seven Seas And Voted Chandrababu Praises Nri Tdp Leaders

Chandrababu: సప్తసముద్రాలు దాటొచ్చి ఓటు వేశారు.. ఎన్ఆర్ఐ టీడీపీ నేతలపై చంద్రబాబు ప్రశంసలు జల్లు

  • Author : Balu J Date : 15-05-2024 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu (2)
Chandrababu (2)

Chandrababu: ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుని దాదాపు నెల రోజులుగా ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడం అద్వితీయమని, వారి సేవలు మరవలేనివని కొనియాడారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవి, గల్ఫ్ టీడీపీ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ కార్యక్రమంలో అధినేత చంద్రబాబునాయుడు జూమ్‌కాల్ ద్వారా పాల్గొని ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా… ఆయనతో సెల్ఫీలు దిగెందుకు పలువురు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపించారు. వెంకట్ కోడూరి, మాలేపాటి సురేష్ తదితరులు ఎన్నికల వేళ తాము నిర్వహించిన విధులు, పోలింగ్ సరళిని చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు మాట్లాడారు.

ఓటుహక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు.. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని, అలా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం దేశవిదేశాల్లోని ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ఎన్ఆర్ఐల సమస్యల కోసం పనిచేస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల సంక్షేమంపై దృష్టిపెట్టకపోవడంతో వారిద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా ఆగిపోయాయని, గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు ప్రమాదం బారినపడితే రూ.లక్ష, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షలు, అక్కడ వారికి ఏదైనా న్యాయ సమస్యలు తలెత్తితే రూ.50 వేల వరకు అందేలా నాడు టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఎపీ ఎన్ఆర్టీ విభాగం కింద టీడీపీ హయాంలో ఇమ్మిగ్రేషన్, ఇతర సమస్యలతో ఇబ్బంది పడేవారిని స్వదేశాలకు తరలించడంతోపాటు దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పించడం కోసం తమ ప్రభుత్వం రెండు శిక్షణ కేంద్రాలు నిర్వహించిందన్నారు.

మన రాష్ట్రం నుంచి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి మంచి వేతనం లభించేలా, వారికి శిక్షణ అందించేలా సదరు కేంద్రాలను నడపడం జరిగిందన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం కృషి చేస్తామని, నేరుగా తనను కలిసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీ భవిష్యత్తు కోసమే తాము కుటుంబ సభ్యులతో సహా స్వచ్ఛందంగా ఏపీకి తరలివచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నామని, స్వయంగా ఓటు వేయడం సంతోషంగా ఉందని పలువురు ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, కూటమి గెలుపు ఏపీకి మలుపు కాబోతుందని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • chandrababu
  • meeting
  • NRI

Related News

Acham Naidu Vs Botsa Satyanarayana

బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

Acham Naidu Vs Botsa Satyanarayana  వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా

    Latest News

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

    • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

    • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

    • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd