Amaravati Relaunch : అమరావతిలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే..!!
Amaravati Relaunch : ఇందులో రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రారంభించనున్న భారీ నిర్మాణాలే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధికి దోహదపడే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి
- Author : Sudheer
Date : 03-05-2025 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతిని పునరుద్ధరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ (Modi) విశిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లారు. నిన్నటి ఏపీ పర్యటనలో ఆయన 18 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం విశేషం. ఇందులో రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రారంభించనున్న భారీ నిర్మాణాలే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధికి దోహదపడే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టాయి.
Amaravati Relaunch : అమరావతి రీ లాంఛ్ వేడుకకు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..?
అమరావతిలో ప్రత్యేకంగా శాసనసభ, హైకోర్టు, సచివాలయం భవనాలు, ఇతర పరిపాలనా నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు. 5,200 కుటుంబాలకు పైగా లక్ష్యంగా రూ.11,240 కోట్లతో గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాకుండా, వరదల నియంత్రణ, ఆధునిక రవాణా వ్యవస్థల కోసం రూ.17,400 కోట్ల భూగర్భ యుటిలిటీలు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. రాజధానిలో మొత్తం 1,281 కి.మీ రోడ్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు, ఇవి సెంట్రల్ మీడియన్లు, సైకిల్ ట్రాక్లు, ఇంటిగ్రేటెడ్ యుటిలిటీలు కలిగి ఉంటాయి.
Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
ఇక రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులతో పాటు, బుగ్గనపల్లె–పాణ్యం, విజయవాడ–న్యూ వెస్ట్ బ్లాక్ హట్ క్యాబిన్ మధ్య రైల్వే ప్రాజెక్టులూ ప్రారంభమయ్యాయి. గుంతకల్ రైల్వే ప్రాజెక్టు రద్దీ తగ్గించడంలో సహాయపడనుంది. తిరుపతి, మలకొండ, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని శక్తివంతమైన అభివృద్ధి దిశగా నడిపించనున్నట్లు ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ అమరావతి తిరిగి ఒక శాశ్వత రాజధానిగా నిలవడానికి వేసిన బలమైన అడుగులుగా భావిస్తున్నారు.