HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Then Kamalam Here Comrades Pawan Kalyan In The Middle

Pawan Kalyan: అటు కమలం.. ఇటు కామ్రేడ్స్.. మధ్యలో పవన్..!

టు చూస్తే బాదం హల్వా.. ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. ఎంచుకునే సమస్య ఎదురయిందో ఉద్యోగికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే ఈ కవితా పంక్తులు గుర్తుకొస్తున్నాయి.

  • By Hashtag U Published Date - 10:48 AM, Sun - 17 September 23
  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan will start a new Program Praja Court from Janasena

By: డా.ప్రసాదమూర్తి

Pawan Kalyan: అటు చూస్తే బాదం హల్వా.. ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. ఎంచుకునే సమస్య ఎదురయిందో ఉద్యోగికి. ఇవి మహాకవి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోని వాక్యాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే ఈ కవితా పంక్తులు గుర్తుకొస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో అనుకోకుండా తన చేతికి చిక్కిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకూడదన్న జాగరూకత జనసేనాని పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు అనంతరం తెలుగుదేశం పార్టీ గందరగోళ పరిస్థితుల్లో పడిపోయిన సందర్భంలో, మొత్తం ప్రతిపక్షమే ఆంధ్రప్రదేశ్ లో అంతరించిపోతుందా.. వచ్చే ఎన్నికల్లో జగన్ కి అడ్డే లేదా.. అనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, పవన్ పక్కా వ్యూహంతో నడుం బిగించి రణరంగంలోకి దూకాడు.

పవన్ తీసుకున్న సమయస్ఫూర్తితో కూడిన ఈ సకాలచర్య అటు అధికార పార్టీ వైసిపి వర్గాల్లో కలవరాన్ని.. ఇటు జనసేన శ్రేణులు సంతోషాన్ని ఏకకాలంలో కలిగించింది. రెండు బలమైన ఎనుబోతులు కుమ్ములాడుకుంటే మధ్యలో ఒక చిన్న మేకపోతు ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు, పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో అనూప్యమైన పరిణామాల నేపథ్యంలో కీలకంగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు లేకపోతే మరొక సమర్ధుడైన నాయకుడు, పార్టీని విజయ పథంలో నడిపించే నాయకుడు ఎవరూ లేరు అనే సందిగ్ధ స్థితిలో పడిన నేపథ్యంలో నేను ఉన్నాను అనే సంకేతాన్ని పవన్, అటు టిడిపి శ్రేణులకు.. ఇటు ప్రజలకు ఏకకాలంలో అందించారు. రెండవ దశ నాయకత్వం బలంగా లేకపోతే పార్టీలో ఎలాంటి పరిస్థితి వస్తుందో దానికి తెలుగుదేశం తాజా ఉదాహరణ.

Also Read: AP Politics: ఏపీలో వ్యక్తుల చుట్టూ రాజకీయాలు..!

తెలుగుదేశం పార్టీ మాట ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. తొలి నుంచి తాను ఎన్డీఏలో భాగమని చెబుతూ వస్తున్నాడు. మరి తెలుగుదేశంతో తాము పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగుతామని ఆయన బలంగా, స్పష్టంగా చెప్పినప్పుడు బిజెపి ఇంతవరకు ఏమీ స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పెద్దలను ఏపీ రాజకీయాలలో కీలక అంశాలపై ఒప్పించడానికి బయలుదేరుతున్నట్టు మంగళగిరిలో తన పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలకు, నాయకులకు చెప్పారు. దీన్నిబట్టి బిజెపి విషయం ఏమిటో ముందు తేల్చుకుని, ఒకవేళ బిజెపి జగన్ కే అనుకూలంగా ఉంటే, తాను బిజెపితో బంధాలు తెంచుకొని ఏపీలో కమ్యూనిస్టులతో చేతులు కలిపి, తమ కూటమిని మరింత బలోపేతం చేయవచ్చు. పవన్ ముందు ఈ రెండు ఆప్షన్సూ ఉన్నాయి.

అయితే అటు కమలం, లేదంటే ఇటు కామ్రేడ్స్.. మనం పైన చెప్పుకున్నట్టు రెండు ఆప్షన్స్, బాదం హల్వా సేమ్యా ఇడ్లీ లాంటివి కావు. ఈ రెండు పక్షాలకు ఏపీ రాజకీయాల్లో ఓట్లు తీసుకొచ్చేంత బలం ఏమీ లేదు. అయినా ఒక కూటమి కడితే ఆ సంఘటనకు సమకూరే శక్తి, అది ఎన్నికల్లో చూపించే ప్రభావం వేరేగా ఉంటుంది. కాబట్టి పవన్ ఢిల్లీ ప్రయాణం రానున్న ఏపీ రాజకీయాల్లో అతి కీలకం కాబోతోంది. తెలుగుదేశం, జనసేనతో పాటు బిజెపి కూటమి కడితే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆ కూటమిలో చేరవు. అలాగే కమ్యూనిస్టులతో కూటమి కడితే అందులో బీజేపీ చేరదు. రెండిట్లో ఎటువైపు అడుగులు వేయాలో పవన్ కళ్యాణ్ దే ఛాయిస్. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా జనసేన కార్యకర్తలు, నాయకులు ఆమోదముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో ఎవరి బలం ఎంత.. ఎవరి ఓటింగ్ శాతం ఎంత.. ఎవరితో కలిసి ఉంటే తమకు లాభం ఎంత.. ఈ అంచనాలతో పవన్ ముందుకు వెళతారు.

పరిణామాలు ఎటు మలుపులు తిరిగినా చంద్రబాబు సుదీర్ఘకాలం జైల్లోనే ఉండాల్సి వస్తే, ప్రతిపక్ష చక్రం తిప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపైనే పడింది. ఈ ఎరుకతోనే పవన్ ముందుకు కదులుతున్నారు. అనుకోకుండా అంది వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో పవన్ ఎంత రాజనీతిని, చతురతను ప్రదర్శిస్తారో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • bjp
  • Comrades
  • Janasena
  • nda
  • Pawan Kalyan
  • Pawan Politics
  • tdp

Related News

Pawan Amaravati

Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

Kutami Government : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం

  • Nirmala Sitharaman, Cm Chan

    Amaravati : అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

  • Vkr Prajadarbar

    Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్

  • Bihar Speaker

    Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

  • Bihar Election Congress

    Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

Latest News

  • Samantha 2nd Wedding : సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!

  • World AIDS Day: హెచ్ఐవీ తొలి లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఎందుకు తప్పనిసరి?

  • MS Dhoni: రాంచీలో జ‌రిగిన మ్యాచ్‌కు ధోని ఎందుకు రాలేక‌పోయాడు? కార‌ణ‌మిదేనా?!

  • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

  • Sheikh Hasina: షేక్ హసీనాకు మ‌రో బిగ్ షాక్‌.. 5 ఏళ్ల జైలు శిక్ష!

Trending News

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

    • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచ‌రీ సంఖ్య ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd