HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Center Has Released Rs 4285 Crore For The Construction Of Amaravati

Amaravati : అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల చేసిన కేంద్రం

రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 విడుదల చేసింది.

  • Author : Latha Suma Date : 07-04-2025 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Center has released Rs. 4,285 crore for the construction of Amaravati.
The Center has released Rs. 4,285 crore for the construction of Amaravati.

Amaravati : కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున 25 శాతం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని సీఆర్డీయే కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 విడుదల చేసింది. అయితే అమరావతి తొలి దశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించగా.. మరో రూ.1,400 కోట్లను తమ నిధుల నుంచి కేంద్రం కేటాయిస్తోంది.

Read Also: Peddi : ‘పెద్ది’ టీజర్ పై అల్లు శిరీష్ ట్వీట్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

అమరావతి రాజధాని నగరంలో ఫేజ్1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి 1600 మిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లు) నిధులిచ్చేందుకు గతంలోనే అంగీకరించాయి. ఇందులో ఒక్కో బ్యాంక్ 800 మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చడానికి అంగీకరించాయి. ప్రపంచ బ్యాంకు అందించిన వివరాల ప్రకారం అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ఈ ఏడాది జనవరి 22న అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతగా 205 మిలియన్ డాలర్ల నిధుల్ని గత నెలలో విడుదల చేశారు. దీంతో కేంద్రం కూడా ఇందులో నుంచి అమరావతి రాజధానికి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో అమరావతిలో నిర్మాణాల పునఃప్రారంభానికి ఊతం లభించబోతోంది.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిధుల కోసం సీఎం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. ఇక ఈ విషయంపై కూటమి పార్టీల ఎంపీలు మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని చెప్పారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు సైతం చేయూతనిచ్చింది. వేల కోట్ల నిధులను కేంద్రం ఇప్పటికే అందించింది.

Read Also: HCU Lands Issue : గచ్చిబౌలి భూములపై విచారణ ..ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • amaravati development
  • Amaravati Funds Release
  • Central Funds for Amaravati
  • CM Chandrababu
  • Deputy CM Pawan Kalyan

Related News

Pawan Cbn Hyd

Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, మహిళలను బూట్లతో తన్నించడం, దౌర్జన్యాలు చేయడం అమానుషమని మండిపడ్డారు. నాడు కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో, సామాన్య రైతులకు రక్షణ

  • Cbn Jagan

    AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Amaravati Fire Incidents

    Amaravati Fire Accident : పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ..కాల్చింది అతడే !!

  • Ap Cabinet Decision

    Chandrababu Naidu: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ..

Latest News

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd