HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Biggest Gold Hub In The Country Will Be In Ap What Is There In It

AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్‌ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..

మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంటనున్న అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంతం పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్‌హబ్‌(AP Gold Hub) ఏర్పాటుకానుంది.

  • Author : Pasha Date : 01-02-2025 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Hub Ap Mangalagiri Andhra Pradesh

AP Gold Hub : ఏకంగా దుబాయ్ రేంజులో ఏపీలో గోల్డ్ హబ్ ఏర్పాటు కాబోతోంది. అది దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇంతకీ ఎక్కడ.. అని ఆలోచిస్తున్నారా ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Gaddar 77th Birth Anniversary Celebrations : గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు – భట్టి విక్రమార్క

ముంబైలోని నవీ ముంబైలో ఉన్న జువెల్లరీ పార్క్ ప్రస్తుతానికి వ్యాపార రీత్యా దేశంలోనే పెద్దది.  కోల్‌కతా, కోయంబత్తూరులలో కూడా పెద్ద జువెల్లరీ పార్కులే ఉన్నాయి. వాటిని మించిన రేంజులో ఏపీలో జువెల్లరీ పార్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది. ఏకంగా రూ.50వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు లక్షమందికి ఉపాధి కల్పించేలా ఏపీలో గోల్డ్ హబ్ ఏర్పాటవుతుందని అంటున్నారు.

Also Read :Delhi Assembly Elections : ఆప్‌కు గట్టిదెబ్బ.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా..

ఇంతకీ ఎక్కడ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో గోల్డ్ హబ్ ఏర్పాటు కానుంది.  ఈవిషయంలో మంత్రి నారా లోకేశ్‌ పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం. ఈ ప్రాంతంలో స్వర్ణకార వృత్తిదారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. దీంతో మంగళగిరిలో గోల్డ్ హబ్ ఏర్పాటు చేయిస్తానని నారా లోకేశ్‌ గతంలో హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. గోల్డ్ హబ్ ఏర్పాటైతే పరిసర ప్రాంతాల్లోని స్వర్ణకారులకు చేతినిండా పని దొరుకుతుంది. దాదాపు 12 వేలమందికి ఉపాధి లభిస్తుంది.

గోల్డ్ హబ్ లొకేషన్..

మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంటనున్న అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంతం పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్‌హబ్‌(AP Gold Hub) ఏర్పాటుకానుంది. ఆత్మకూరు సర్వే నంబర్లు 133, 134, 135, 136లలో ఉన్న ప్రభుత్వ ఖాళీ, అసైన్డ్‌ భూముల్లో జిల్లా అధికారులు దాదాపు 60 ఎకరాలను గోల్డ్ హబ్ నిర్మాణానికి ఎంపిక చేశారు. రెండు మూడు నెలల్లోనే అక్కడ జువెల్లరీ పార్కు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్‌హబ్‌లో రత్నాలు, బంగారంతో కూడిన ఆభరణాలను తయారు చేస్తారు. ఈ ఆభరణాలకు తరుగు తక్కువస్థాయిలో ఉంటుంది. ఈ పార్కులో కొనుగోలుదారులకు తరుగు మూడు శాతమే ఉంటుంది.

ముక్కుపుడక నుంచి వడ్రాణం వరకు..

ముక్కుపుడక నుంచి వడ్రాణం వరకు అన్నిరకాల మోడళ్లలో ఆభరణాలను తయారు చేసేందుకు అవసరమైన మిషనరీ ఈ పార్కులో అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన టెస్టింగ్‌ ల్యాబ్‌లతో సహా అవసరమైన సౌకర్యాలన్నీ ఉంటాయి. మంత్రి లోకేశ్‌ సొంత ఖర్చులతో ఎల్‌ఎన్‌ గోల్డ్‌స్మిత్‌ ఫౌండేషన్‌ పేరిట ఓ సంస్థను స్థాపించి మంగళగిరిలోని స్వర్ణకారులందరికీ ఆధునిక డిజైన్ల తయారీపై శిక్షణ ఇప్పించబోతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • AP Gold Hub
  • Gold Hub
  • india
  • mangalagiri

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd