HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >That Name Came About Because Of Pawan Kalyan Says Ambati Rambabu

పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 14-01-2026 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Rambabu
Ambati Rambabu

Ambati Rambabu  గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు.

  • గుంటూరు భోగి వేడుకల్లో అంబటి రాంబాబు
  • మరోసారి డ్యాన్స్‌తో దుమ్ము రేపారు
  • పవన్ వల్లే సంక్రాంతి సంబరాలకు ప్రాధాన్యత

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండుగలో భాగంగా నేడు భోగి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామునే ఆయన భోగి వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఈసారి అంబటి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. డప్పు చప్పుళ్లతో వేడుకలు నిర్వహించిన ఆయన.. తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోలను భోగి మంటల్లో వేశారు.

అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తాను ఎక్కడుంటే అక్కడే సంబరాలు జరగాలి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. సంక్రాంతి సంబరాలు అనగానే తాను గుర్తుకు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు. తాను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే.. పవన్ కళ్యాణ్ తనను ‘సంబరాల రాంబాబు’ అన్నారని గుర్తు చేశారు. దీంతో పాటు ‘బ్రో’ సినిమాలో తన పాత్రను పెట్టి గేలి చేసే ప్రయత్నం చేశారని, కానీ మొన్ననే ఆయన కూడా డ్యాన్స్ చేశారని విమర్శించారు. తాను రాజకీయ నాయకుడినని, ఆయన సినిమా యాక్టర్ అని, ఆయన తన మీద కౌంటర్ చేయడం వల్లే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చిందని, తనకు ‘సంబరాల రాంబాబు’ అనే పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు.

తాను సంక్రాంతికి సంబరాలు చేస్తాను కాబట్టే తనకు సంక్రాంతి సంబరాల రాంబాబు అనే పేరు వచ్చిందని తెలిపారు. తాను సంబరాల రాంబాబు అనే విషయాన్ని అంగీకరిస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

అంబటి రాంబాబు భోగి పండుగ సందర్భంగా ఇలా డ్యాన్స్ చేయడం ఇదే ప్రథమం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన భోగి పండుగ వేళ ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ఇదివరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన కారణంగా.. అక్కడ భోగి వేడుకలు నిర్వహించి డ్యాన్స్ చేసేవారు. ఈసారి గుంటూరులో నిర్వహించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా, అంబటి రాంబాబు పార్టీ కార్యకర్తలతో కలిసి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • Andhrapradesh
  • Bhogi Celebrations
  • DCM Pawan Kalyan
  • guntur
  • viral dance video

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

    • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

    • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

    • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd