Pawan Kalyan: అనన్య నాగళ్లకు ధన్యవాదాలు: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్తమాన నటి, కుమారి అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్ని ఇస్తుంది” అని ట్వీట్ చేశారు.
- By Latha Suma Published Date - 04:08 PM, Fri - 6 September 24

Ananya Nagalla announced the donation: తెలుగు రాష్ట్రాలను వరదలు కుదిపేయడం పట్ల టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల తనవంతుగా సాయం ప్రకటించిన విషయ తెలిసిందే. ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు ఇస్తున్నట్టు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇవ్వడం పట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వానికి తన వంతు సహాయం చేసిన అనన్య నాగళ్లకు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
మీ చేయూత బలాన్ని ఇస్తుంది..
” ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్తమాన నటి, కుమారి అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్ని ఇస్తుంది” అని ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా అనన్య నాగళ్ళ “థాంక్యూ సో మచ్ సార్, మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం” అంటూ బదులిచ్చింది.
Thank you so much sir.
You’re always my inspiration 🙏😊
This means the world to me 😀 https://t.co/eg3MWBz2Ov— Ananya Nagalla (@AnanyaNagalla) September 6, 2024
కాగా, భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. వర్ష బీభత్సం వల్ల చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీటమునిగాయి. కనీసం తాగడానికి నీరు కూడా దొరకని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు, నిర్మాతలు, ముఖ్యమంత్రుల సహాయనిధికి భారీగా విరాళాలు అందజేశారు. అయితే సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లలో విరాళాలు ఇచ్చింది అనన్య ఒక్కతేనని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు రాకపోయినా, స్టార్ హీరోయిన్ హోదా లేకపోయినా అనన్య నాగళ్ళ వరద బాధితుల కోసం ఐదు లక్షల సాయం ప్రకటించింది.