HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Teacher Murder In Vijayanagaram

Murder : ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు దారుణ హ‌త్య‌.. న‌లుగురు అరెస్ట్‌

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన

  • Author : Prasad Date : 17-07-2023 - 9:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన యెగిరెడ్డి కృష్ణ అనే టీచ‌ర్‌ని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు దారుణంగా హ‌త్య చేశారు. ఈ హ‌త్య‌కు రాజ‌కీయమే కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసులో న‌లుగురు వ్య‌క్తుల్ని విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన మరడాన మోహన్‌రావు, రెడ్డి రాము, మరడాన వెంకట నాయుడు, మరడాన రామస్వామిలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్దవోలు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.ప్రభుత్వ ఉపాధ్యాయుడు యేగిరెడ్డి కృష్ణ గత రెండు దశాబ్దాలుగా టీడీపీ సానుభూతిపరుడిగా తన స్వగ్రామమైన ఉద్దవోలులో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు. దీంతో తన ప్రత్యర్థి అదే గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మరడాన వెంకట్‌నాయుడుతో శత్రుత్వం ఏర్పడింద‌ని.. ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి కృష్ణపై వెంకట్‌నాయుడు ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు చేశారని ఎస్పీ తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయుడు కృష్ణ పరోక్షంగా మద్దతు ఇచ్చిన‌ సునీతపై వెంకట్ నాయుడు ఓటమి పాలయ్యారు. ఆ త‌రువాత త‌న‌కు కాంట్రాక్టు ప‌నుల బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నాడ‌నే క‌క్ష‌తో హ‌త్య చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ వెల్ల‌డైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • murder
  • political
  • teacher

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

Latest News

  • మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూత‌ప‌డ‌నున్నాయంటే?

  • ప్రభుత్వ కాలేజీలకు కొత్త ఊపు .. ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు : మంత్రి లోకేష్‌

  • వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • నా పేరుతో తప్పుడు స్టేట్‌మెంట్లు ప్రచారం చేయకండి: శిఖ‌ర్ ధావ‌న్‌

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

Trending News

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd