TDP MLA Husband Arrested: రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు అరెస్ట్
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu)ను అరెస్ట్ చేశారు. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది.
- Author : Gopichand
Date : 30-04-2023 - 3:10 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu)ను అరెస్ట్ చేశారు. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది. ఆదిరెడ్డి వాసుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (Adireddy Apparao)ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ రాజమండ్రి సీఐడి కార్యాలయానికి తరలించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి అరెస్ట్ సంచలనంగా మారింది. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది.
Also Read: Jagananne Maa Bhavishyathu: 1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో వైసీపీ ప్రభంజనం
ఆదిరెడ్డి వాసుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించారు. సీఐడీ పోలీసులు ఆదివారం ఉదయం ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావులను అరెస్ట్ చేయడంతో రాజమండ్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రాజమండ్రి సీఐడీ ఆఫీసుకు ఇద్దరిని తరలించారు. దీంతో ఆదిరెడ్డి అభిమానులు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సీఐడీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అప్పారావు, వాసులను అక్రమంగా అరెస్ట్ చేశారని నేతలు మండిపడుతున్నారు.