TDP Membership Registration : రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న టీడీపీ సభ్యత్వాలు..లోకేశా..మజాకా..!!
TDP Membership : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 100 కోట్లకు పైనే వెచ్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఆలోచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆన్లైన్ చేయడం ద్వారా వేగం, పారదర్శకత జోడించారు
- By Sudheer Published Date - 09:59 PM, Mon - 25 November 24

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు (TDP Membership Registration 2024-26) ఒక ఉద్యమంలా మొదలై.. సాంకేతికత అందిపుచ్చుకొని రికార్డులు సృష్టించేలా మిలియన్ల సభ్యత్వాలు కొద్ది రోజుల్లోనే నమోదు అవ్వడం వెనక మాస్టర్ మైండ్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీకి కర్త, కర్మ, క్రియ అయిన కార్యకర్త సంక్షేమమే తన లక్ష్యమంటూ నారా లోకేష్ దేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని టిడిపి సంక్షేమ విభాగంని ప్రారంభించి, తానే ఆ విభాగం బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటివరకు 100 కోట్లకు పైనే వెచ్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఆలోచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆన్లైన్ చేయడం ద్వారా వేగం, పారదర్శకత జోడించారు. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా కల్పించే ఆలోచన కూడా యువగళం నారా లోకేష్‌దే. సభ్యత నమోదు 2024 కార్యక్రమం పూర్తిగా ఆన్లైన్ చేయడంతో నెల రోజుల్లోగానే 50 లక్షల పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇదీ నారా లోకేష్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తండ్రిని మించిన తనయుడుగా అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ తన మార్కు చూపిస్తున్నారు నారా లోకేష్ (Nara Lokesh).
తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదమై వెలుగొందిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ.
తెలుగు ప్రజలంతా “అన్నా” అని పిలిచిన స్వర్గీయ ఎన్టీరామారావు గారిచే స్థాపించబడిన పార్టీ తెలుగుదేశం. దార్శనికనేత చంద్రబాబు గారి అధ్యక్షతన తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా సగర్వంగా ఎగరేస్తోన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నాలుగు దశాబ్దాలుగా తెలుగుజాతి ఉన్నతి కోసం కృషి చేస్తూ… తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడుతూ… సామాన్యుడి పార్టీగా తెలుగువారి జీవన స్రవంతిలో మమేకమై ప్రవహిస్తోన్న జీవనది తెలుగుదేశం పార్టీ.
అటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే… తెలుగువారికి అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించడానికి మీరు సహకరించడం దేశంలో ఘనమైన చరిత్ర… ప్రజాస్వామిక విలువలు… సమసమాజ భావనలు కలిగి ఉన్న విశిష్టమైన పార్టీ తెలుగుదేశం. అందుకే నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ అని నాలుగు దశాబ్దాలుగా సగర్వంగా చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. తరాలు మారినా… పార్టీని మోస్తున్న భుజాలు మారుతున్నా… పసుపు జెండా వన్నె తరగలేదు. ఎందుకంటే ఇది భవిష్యత్తునిచ్చే పార్టీ. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26 గత నెల అక్టోబర్ 26న ప్రారంభమైంది. అంటే సరిగ్గా నెలరోజులు అన్నమాట. ఈ ఒక్క నెలలోనే అరకోటి అంటే 50 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. టీడీపీకి ప్రాణం పెట్టే కార్యకర్తలు ఉన్నారు. అందుకే వాళ్ళ ఋణం తీర్చుకోడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేసారు. ఇలా కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం.
కేవలం రూ.100ల సభ్యత్వ రుసుము చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందిస్తుంది తెలుగుదేశం. గతంలో ఈ బీమా సౌకర్యం 2 లక్షలకు మాత్రమే ఉండేది. కార్యకర్తలు మరణిస్తే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వడం జరుగుతుంది. కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కార్యకర్తల కుటుంబాలలోని విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది తెలుగుదేశం.
కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు ఉపాధిని పొంది వారి కాళ్లపై వాళ్ళు నిలబడేలా పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే అటువంటి వారి చికిత్స కోసం ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం. ఇప్పటివరకు చూస్తే… తెలుగుదేశం పార్టీ సంక్షేమ విభాగం ద్వారా…రూ.120 కోట్ల మేర ప్రమాద బీమా అందించారు.
కార్యకర్తల కుటుంబాల్లోని 1,672 మంది విద్యార్థుల చదువుకు సుమారు రూ.2 కోట్ల 35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. విదేశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు, చదవాలనుకునే వారికి కూడా కలిపి, సుమారు 180 మందికి అవసరమైన సహాయ, సహకారాలు అందజేశారు. పార్టీ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇచ్చి వారిలో 850 మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పించారు. మరో 200 మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు. అటువంటి తెలుగుదేశం పార్టీలో భాగస్వాములయ్యేందుకు, నూతన రక్తాన్ని, నూతన ఉత్తేజాన్ని ఆహ్వానిస్తోంది తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి సులభంగా ఆన్ లైన్లోనే తీసుకోండి. వాట్సాప్ ద్వారా అయితే http://bit.ly/3UsvoJx లింక్ ను ఉపయోగించండి. తెలుగుదేశం పార్టీలో చేరండి… చేర్పించండి. ఎందుకంటే ఇది భవిష్యత్తునిచ్చే పార్టీ.