HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Varla Ramaiah Meet Election Commisioner

TDP : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 శాతం బోగస్ ఓట్లే.. బోగస్ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసిన వర్ల రామ‌య్య‌

వైసీపీ పాలనలో ఎన్నికల ప్రక్రియ ఓ ప్రసహనంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమ‌ర్శించారు.

  • By Prasad Published Date - 06:49 AM, Fri - 10 March 23
  • daily-hunt
Varla
Varla

వైసీపీ పాలనలో ఎన్నికల ప్రక్రియ ఓ ప్రసహనంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమ‌ర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల నమోదుపై న్యాయవాది వజ్జా శ్రీనివాస్ తో కలిసి వర్ల రామయ్య సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ….ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వేల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తోందన్నారు. పట్టభద్రుల ఓటర్ లిస్ట్ లో 30 శాతం బోగస్ ఓట్లేన‌ని… 10 తరగతి చదవని వాళ్లను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేశారని ఆయ‌న ఆరోపించారు. ఒకే ఇంటి అడ్రస్ తో 44 ఓట్లు, వైసీపీ పార్టీ ఆఫీస్ అడ్రస్ తో 38 ఓట్లు ఉన్నాయని.. ఒక్క తిరుపతిలోనే 7 వేల బోగస్ ఓట్లు ఉన్నాయన్నారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని… పోలీసులే పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని ఇంకెవరు కాపాడుతారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బోగస్ ఓట్ల ప్రక్రియ సాగుతోందని..తిరుపతి ఎస్పీ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు ఆడుతూ బోగస్ ఓట్లకు సహకరిస్తున్నారని వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. బోగస్ ఓట్లపై ఆధారాలతో సహా సీఈసీకి అందజేశామ‌ని.., దీనిపై విచారణ జరిపి బోగస్ ఓట్ల ప్రక్రియలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్క అధికారి, వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామ‌న్నారు. దీనికి సీఈసీ స్పందిస్తూ వర్ల ఫిర్యాదుపై ఒకటి రెండు రోజుల్లోనే పోలీసులు, రిటర్నింగ్ అధికారులతో నివేదిక తెప్పించుకుంటామమని విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతామని తెలిపారని.. అంతే కాకుండా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని పోలింగ్ బూత్ లోనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకునేలా సంబందిత రిటర్నింగ్ అధికారులకు తగు సూచనలిస్తామని సీఈసీ త‌మ‌కు హామీ ఇచ్చార‌ని తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Election commission
  • Graduate MLC polls
  • tdp
  • ysrcp

Related News

YS Jagan

YS Jagan: బాల‌కృష్ణ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో ఇదే!

అయితే ఈ వివాదంపై నటుడు చిరంజీవి అప్పట్లోనే స్పందించారు. గత ప్రభుత్వంలో తనకు ఎలాంటి అవమానం జరగలేదని, నాటి ముఖ్యమంత్రి జగన్ తనను గౌరవంగా ఆహ్వానించి మాట్లాడారని ఆయన స్పష్టం చేసిన విషయాన్ని జగన్ వర్గం ఇప్పుడు గుర్తుచేస్తోంది.

  • Bihar Elections

    Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!

Latest News

  • Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!

  • Virat Kohli: సిడ్నీ వన్డే తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా?

  • Cricket World Cup 2025: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌.. భార‌త్ త‌ల‌ప‌డే జ‌ట్టు ఏదీ?

  • Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

  • Kurnool Bus Fire: క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన బ‌స్సు, వీడియో ఇదే!

Trending News

    • Virginity: వర్జినిటీ కోల్పోవ‌డానికి స‌రైన వ‌య‌స్సు ఉందా?

    • Relationship Tips: మీ భాగ‌స్వామిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? అయితే దూరం అవుతున్న‌ట్లే!

    • 8th Pay Commission: ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్ప‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం!

    • HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్

    • ATM Rules: ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే ఇక‌పై రూ. 23 క‌ట్టాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd