Vangaveeti Radha : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత వంగవీటీ రాధ
- Author : Prasad
Date : 18-01-2024 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల సందండి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందువరుసలో ఉండగా.. ప్రతిపక్ష టీడీపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జోరుగా సభలు నిర్వహిస్తున్నారు. ఇటు జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరూ సీట్ల కేటాయింపులపై సమావేశాలు జరుపుతున్నారు. దాదాపుగా సీట్ల కేటాయింపులపై కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. బీజేపీ కూడా ఎక్కువగా సీట్లు అడుగుతుండటంతో జనసేన – టీడీపీ పార్టీలు ఆలోచిస్తున్నాయి. బీజేపీతో పొత్తు తేలకపోతే ఈ నెల చివరి వారంలో సీట్ల ప్రకటన చేయాలని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికల నోటిఫికేటషన్ వచ్చే అవకాశం ఉంటంతో సీట్ల కేటాయింపులపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు పార్టీల్లో చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. టికెట్లు రాని వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అయితే వైసీపీలో మాత్రం పెద్దగా చేరికలు జరగడంలేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న వారికి వైసీపీగాలం వేస్తుంది. ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతల్ని పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇవ్వాలని భావిస్తుంది. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న వంగవీటి రాధా పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుంతుంది. వైసీపీ నేతలు కూడా వంగవీటి ఫ్యామిలీలో రెండు సీట్లు ఇస్తామంటూ ఆఫర్ చేస్తుంది. గత కొద్దిరోజులుగా రాధా పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై తాజాగా వంగవీటి రాధా స్పందించారు. తాను టీడీపీలోనే ఉంటానని.. గాలి పార్టీ గాలి వార్తలను నమ్మోద్దని తన అభిమానులను, టీడీపీ శ్రేణులను కోరారు. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. వైసీపీ నేతలకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని వంగవీటి రాధా తెలిపారు.
Also Read: Telangana: కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పోరాటం తప్పదు