HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Pattabhiram Says False Cases Booked In Attack On Ys Jagans Case

YS Jagan Stone Attack: జగన్ గులకరాయి డ్రామా: పట్టాభిరామ్

ఇటీవల విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు.

  • Author : Praveen Aluthuru Date : 20-04-2024 - 6:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan Stone Attack
YS Jagan Stone Attack

YS Jagan Stone Attack: ఇటీవల విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. పట్టాభిరామ్ దాడి ఘటనను డ్రామాగా అభివర్ణిస్తూ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే మైనర్ బాలుడిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. తనపై గులకరాళ్లు వేయించుకుని ప్రజల్లో సానుభూతి పొంది నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని జగన్ భావిస్తున్నాడు. అయితే జగన్ తీరుని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు పట్టాభిరామ్. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా, 2014 ఎన్నికలకు ముందు గులకరాయి డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. అప్పుడు భుజానికి ప్లాస్టర్ వేసుకున్నాడని, ఇప్పుడేమో నుదుటికి ప్లాస్టర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తున్నాడని సీఎం జగన్ పై సెటైర్లు పేల్చారు పట్టాభిరామ్.

సతీష్‌ను బలిపశువుగా మార్చారని, పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని, రాబోయే రోజుల్లో కోర్టుకు సమాధానం చెప్పాలని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమపై కేసులు బనాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడిని డ్రామాగా పేర్కొంటూ టీడీపీ నేతపై కేసులు బనాయించడం దారుణమన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తప్పుడు వ్యూహాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఈ కేసులో పోలీసులు వారి చర్యలకు సమాధానం చెప్పాలని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join

కాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై జరుగుతున్న విచారణలో, ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. రాళ్ల దాడి కేసులో తనను అరెస్టు చేసేందుకు నిన్న 100 మంది పోలీసులు నా కార్యాలయాన్ని చుట్టుముట్టారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సిగ్గుతో తల దించుకోవాలని.. తప్పుడు బర్త్ సర్టిఫికెట్‌తో మైనర్‌ను ఇరికించారని.. ఈ కేసులో నిందితుడు దుర్గారావును 24 గంటల్లోగా న్యాయమూర్తి ముందు ఎందుకు హాజరుపరచలేదని సూటిగా ప్రశ్నించారు.

Also Read: Pooja Hegde : దేవర ఐటం సాంగ్ తో ఊపు ఊపేందుకు సిద్ధమైన అమ్మడు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections 2024
  • bonda uma
  • false cases
  • investigation
  • Pattabhiram
  • stone attack
  • ys jagan

Related News

Polavaram Project

జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Polavaram Project  దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd